37.2 C
Hyderabad
April 26, 2024 20: 14 PM
Slider కడప

ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఉద్యమాలే – సీఐటీయూ

మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవని సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలి రవికుమార్ హెచ్చరించారు. మెడికల్ ఇన్సూరెన్స్ ను జీతం నుంచి రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తిరేకంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలలో ఎందరో నాయకులను చూశాము కానీ మున్సిపల్ కార్మికుల పట్ల ఇంతటి నిర్దయగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇదేనని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, జీవో నెంబర్ 190 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ర్మికులకు 26 వేతనం ఒక దఫా గానే ఖాతాలో జమ చేయాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు ఉత్తుత్తి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చక పోగా కార్మికులకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి ఉంటే హెల్త్ అలవెన్స్ ను జీతం నుంచి రికవరీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఒక సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు సి.హెచ్ ఓబయ్య,జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, మండల ప్రచార కార్యదర్శి రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్, రవిశంకర్, సి.సురేష్, సాలమ్మ, కుంచెం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ

Satyam NEWS

ఒకడు పోయాడు…. మరొకడు పోతాడు

Satyam NEWS

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలు

Satyam NEWS

Leave a Comment