33.2 C
Hyderabad
May 15, 2024 19: 49 PM
Slider అనంతపురం

కళ్యాణదుర్గం ఎస్ ఆర్ ఓ పై విచారణ అటకెక్కిందా?

#Kalyanadurgam SRO

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ ఏకపక్షంగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ను రద్దు చేసిన వ్యవహారంపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు. 17 నెలల క్రితం రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ను క్రయ, విక్రయ దారుల ప్రమేయం లేకుండానే ఎస్ ఆర్ ఓ రద్దు చేయడం సంచలనం సృష్టించింది.

ఆ శాఖ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి అని ఆ శాఖ అధికారులే చెప్పారు. ఆయనపై విచారణ అటకెక్కిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పు చేసిన ఏ అధికారిని వదిలిపెట్టబోమని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు బీరాలు పలుకుతూ వచ్చారు.

అది ఉత్తుత్తి మాటలేనన్న అంశం కల్యాణదుర్గం ఎస్ ఆర్ ఓ విషయంలో నిజమైనట్లు కనిపిస్తోంది. ఆయన విషయంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎందుకు మెతక వైఖరిని ఆలంబిస్తున్నారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకి వెళితే…. బెలుగుప్ప కు చెందిన బోగతి చంద్రమ్మ, బోగతి ఆదినారాయణ రెడ్డి లకు చెందిన సర్వేనెంబర్ 61/1 లోని 4.3 ఎకరాల భూమిని అదే మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు 2022 జనవరి 18వ తేదీన భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

కొంతకాలానికి ఆ భూమి తమ పేరుపై లేదని తెలుసుకున్న ఆంజనేయులు కుమారుడు నరేష్ సబ్ రిజిస్ట్రార్ వద్దకు వచ్చారు. ఈ విషయమే ప్రశ్నిస్తే ఎస్.అర్. ఓ పొంతనలేని సమాధానం చెప్పారని నరేష్ మీడియాకు చెప్పారు. చివరకు ఆ డాక్యుమెంట్ రద్దయి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు బయటపడిందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు.

తమ పేరుతో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ ను రద్దు చేశారంటూ నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన జరిగి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల దృష్టికి వచ్చి రెండు వారాలు అయినప్పటికీ ఇంతవరకు ఆయన పై విచారణ జరిపి ఎందుకు చర్యలు తీసుకోలేదో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకే తెలియాలి. ఇంత పెద్ద ఆరోపణను అధికారులు సాదాసీదాగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కోటి రూపాయలు విలువ చేసే భూమి అన్యాక్రాంతమైన బాధితుడి కుటుంబ రోధన అరణ్య రోదనగా మారింది.

వాస్తవానికి ఇంత పెద్ద తప్పు జరిగినప్పటికీ ఆయన తన విధుల్లో కొనసాగడం ఆ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. జరిగిన తప్పిదం పై విచారణ జరిపి నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పై ఉంది. రెండు వారాలు అవుతున్నా విచారణ అతీగతి లేదని తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ మాత్రం దర్జాగా తనకేమీ సంబంధం లేనట్లు విధి నిర్వహణలో కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పదేపదే చెబుతూ వచ్చారు. కఠిన చర్యలు ఏమోగానీ కనీసం విచారణ జరిపారా? లేదా? అన్నది కూడా ఇంతవరకు స్పష్టత లేదు. ఇందులో కథాకమామిషు ఏముందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది…

కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ పై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి మాధవి చెప్పారు… సుమారు రెండు వారాలైనప్పటికీ ఆ నివేదిక ఏమైందో? అసలు పంపారో లేదో? ఒకవేళ పంపి ఉంటే రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కార్యాలయం జాప్యం చేస్తోందా? అనేది తెలియాల్సి ఉంది.

Related posts

త్వరలో జాతీయ రహదారి పనులకు శ్రీకారం: బిజెపి నేతల హర్షం

Satyam NEWS

కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారానికి చర్యలు తీసుకోవాలని పిల్

Satyam NEWS

క్లీన్ అండ్ గ్రీన్ పై గోల్నాక డివిజన్ లో సమీక్ష

Satyam NEWS

Leave a Comment