27.7 C
Hyderabad
May 4, 2024 08: 12 AM
Slider ప్రత్యేకం

కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారానికి చర్యలు తీసుకోవాలని పిల్

#Telanganahighcourt

హైకోర్టు నుంచి దిగువ కోర్టుల వరకూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ న్యాయ విద్యార్థి ఒకరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని నల్సర్ లా యూనివర్శిటీ లో LLM చేస్తున్న న్యాయ విద్యార్ధిని, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీలేఖా పూజారి యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ల బెంచ్ పిటిషన్ ను పరిశీలనకు తీసుకుంది.

రెండు వారాల్లో కౌంటర్ దాఖలు  చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోర్టు వ్యాజ్యాలను లైవ్ స్ట్రీమ్ (ప్రత్యక్ష ప్రసారం) లేదా ఆడియో వీడియో రికార్డింగ్ అందుబాటులో ఉంచడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. మొత్తం న్యాయ కార్యకలాపాలు “ఓపెన్ కోర్ట్” లో జరుగుతుంటాయి కానీ వివిధ కోర్టుల్లో సిట్టింగ్ సదుపాయాలు పరిమితంగా ఉంటున్నాయని, అందువల్ల నిర్దేశిత లక్ష్యం నెరవేడం లేదని పిటిషనర్ తెలిపారు.

ఈ కారణంగా రాజ్యాంగంలో పొందుపరచిన సమాచారం తెలుసుకునే హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ న్యాయ స్థానాలలో ఏం జరుగుతున్నదో వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో తెలుసుకోవాలనుకుంటారని, అయితే పరిమితమైన మౌలిక సదుపాయాల కారణంగా అది నెరవేరడం లేదని పిటిషనర్ తెలిపారు.

ఈ కారణంగా న్యాయ స్థానాలలో జరిగే కార్యకలాపాలను ప్రజలు అందుబాటులో ఉంచేందుకు లైవ్ స్ట్రీమ్ (ప్రత్యక్ష ప్రసారం) లేదా ఆడియో వీడియో రికార్డింగ్ అందుబాటులో ఉంచాలని పిటిషనర్ కోరారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వర్సెస్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కేసులో లైవ్ స్ట్రీమ్ పై సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పిటిషనర్ గుర్తు చేశారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

మహిళా సంఘాల బకాయిలు విడుదల చేయకుంటే ఆమరణ దీక్ష

Satyam NEWS

పెరుగుతున్న అసంతృప్తి: నెల్లూరు నుంచి మరో ఎమ్మెల్యే తిరుగుబాటు?

Satyam NEWS

గుడ్ న్యూస్: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

Satyam NEWS

Leave a Comment