37.7 C
Hyderabad
May 4, 2024 12: 05 PM
Slider ఖమ్మం

జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకo

#babujagjeevanram

బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు.  స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ  ఉప ప్రధాన మంత్రి  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ  జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో శిక్షణ ఐ.పిఎస్ అవినాష్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడి కె. సత్యనారాయణ, ఎస్సి కార్పొరేషన్ ఇడి ఏ. శ్రీనివాసరావు,  నాయకులు తదితరులు ఉన్నారు.    అనంతరం శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రం లో సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, మహనీయుల జీవితాల నుండి పాఠాలు నేర్చుకోవాలన్నారు. మహనీయుల జీవితాలు ఒక సందేశంగా వుంటాయని, వాటిని మార్గదర్శకం చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఉప ప్రధాని గా, 40 సంవత్సరాలకు పైగా ఎంపీ గా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారన్నారు. వ్యవస్థ లో ఉండి, దళితుల కొరకు పోరాడిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. డా. బీఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రచనతో, అధికారం రాగానే పోరాడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. ఆధికారంతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చవచ్చన్నారు. మహనీయుని జీవితంతో స్ఫూర్తి పొంది, మంచిగా చదువుకొని, ఉన్నత స్థానానికి వెళ్తే, చాలా మందికి మంచి చెయ్యొచ్చన్నారు. దళితుల అభివృద్ధి కి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దళిత బంధు పథకం తో దళితులకు రూ. 10 లక్షలు పెట్టుబడి సాయం క్రింద అందిస్తుందని అన్నారు. చింతకాని మండలంలో ఉన్న మొత్తం 3,600 దళిత కుటుంబాలకు దళిత బంధు లబ్ది చేకూరిందని కలెక్టర్ తెలిపారు.

Related posts

బదిలీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

Satyam NEWS

నైపుణ్య కేంద్రాలను పరిశీలించిన ఫ్రాన్స్ ప్రతినిధులు

Satyam NEWS

భవన నిర్మాణ కార్మికులు బిఒసిడబ్ల్యు కార్డు పొందాలి

Satyam NEWS

Leave a Comment