38.2 C
Hyderabad
April 29, 2024 14: 09 PM
Slider శ్రీకాకుళం

బదిలీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

#Teachers Protest

ఉపాధ్యాయుల బదిలీలలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, హామీలు ఇచ్చిన అంశాలు కూడా ఉత్తర్వులు ఇవ్వలేదని, బదిలీలలో ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేస్తోందని, మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య( ఫ్యాప్టో) ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడించారు.

ఉదయం ఎనిమిదిన్నర గంటలకే ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి చేరుకోవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్, ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు ప్రహసనంగా మారాయని అన్నారు.

రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా బదిలీల నిబంధనలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల లో ఖాళీ అన్ని చూపించాలని మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

హామీ ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయడం లేదు

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొoటి గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులకు బదిలీల విషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని, హామీలు ఇచ్చిన విషయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేయడం లేదని, జిల్లాలో పాఠశాలల కేటగిరీలకు సంబంధించి, బదిలీలలో ఉపాధ్యాయుల పాయింట్లకు సంబంధించి అనేక పొరపాట్లు చేస్తున్నారని ఇవన్నీ సరిచేసి  పారదర్శకంగా మాన్యువల్ కౌన్సిలింగ్ లో బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ అధికారుల దుర్మార్గ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్ పేడాడ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పాఠశాలలను రాజకీయ సభలకు వేదికగా మార్చేశారని విద్యారంగాన్ని బదిలీల్లో కూడా వ్యాపారంగా మార్చేశారని అన్నారు.

మాన్యువల్ కౌన్సిలింగ్ లో బదిలీలు నిర్వహించాలి

ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీల లో ఖాళీలను చూపించకుండా బ్లాక్ చేసి తరువాత సిఫార్సు బదిలీల కోసం ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోందని బదిలీల్లో పారదర్శకత లేకుండా ఉండటానికి మాన్యువల్ కౌన్సిలింగ్ ప్రభుత్వం మొగ్గు చూపటం లేదని ఆరోపించారు.

ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ బల్ల సుభాష్ బాబు మాట్లాడుతూ గతంలో ఉద్యమాలతో సాధించుకున్న ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్ విధానానికి ఇప్పుడు తూట్లు పొడుస్తున్నారని, మ్యాన్యువల్ కౌన్సిలింగ్ జరపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల విషయంలో పారదర్శకంగా, ప్రజాస్వామికంగా లేనిపక్షంలో రైతు ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జి మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి బల్ల సుభాష్ బాబు, ఏపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటీ గిరిధర్,

ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులు యుటిఎఫ్ అధ్యక్షులు పొందూరు అప్పారావు, జనరల్ సెక్రటరీ రెడ్డి మోహన్ రావు,  ఏపిటిఎఫ్ 1938 ప్రధాన కార్యదర్శి టెంక చలపతి రావు, డిటిఎస్ అధ్యక్షులు కొమ్ము అప్పలరాజు, బి టి ఎ అధ్యక్షులు ఆలికాన చెంచు నాయుడు,

డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోత ధర్మారావు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, గురుబెల్లి రమణ, ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస పట్నాయక్, ఎస్ వి రమణ మూర్తి ఎం రమేష్ ఎస్ వి సత్యనారాయణ, సి.హెచ్.రామారావు, వి. కామేశ్వరరావు, రామ్మోహన్ రావు, రామారావు, నవీన్ కుమార్, బి రవి కుమార్, ,గురుగుబెల్లి రమణ, చింతాడ సూర్యారావు, పూజారి హరి ప్రసన్న, 

ఎం శ్యామ్ ప్రసాద్, కేశవరావు, బమ్మిడి శ్రీరామమూర్తి, బాలాజీ రావు, ధనుంజయ రావు, క్రాంతి కుమార్, యండ ఉమా శంకర్, అన్నాజీ రావు, తాతారావు, ఆర్ లక్ష్ము నాయుడు, డి పెంటయ్య, శ్రీనివాస రావు, బి రవి కుమార్, కిషోర్, ఎన్ వాగ్దేవి, ఏ సాంబ మూర్తి, గురుగుబెల్లి గోపాలరావు,

ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి దాలినాయుడు, పాల్గొని ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు చావలి శ్రీనివాస్, దాసరి రామ్మోహన్, వెంకు మహంతి నవీన్ కుమార్, పి.సూరిబాబు, గోగుల సూర్యనారాయణ,

బివి రమణ , ఎన్ వాణిశ్రీ, తమ్మినేని సూర్యనారాయణ, పైడి శ్రీరామ్మూర్తి, పిళ్లా తిరుపతిరావు, సదాశివుని శంకర్రావు, ఎండ రామినాయుడ్, పి ఎస్ నాగరాజు, పి మోహన రావు, ఆర్ వి ఎస్ ఎస్ ప్రసాద్ రావు, గోరు శ్రీధర్, మీసాల శ్రీనివాస రావు, సూరు సత్యనారాయణ,

బి జనక మోహన రావు, కేశవరావు, పి కవిత, పైడి నాగభూషణరావు, కంచరాన భుజంగరావు, మార్పు అశోక్, కరుణాకర్, బొంతు అప్పలనాయుడు వందల సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Satyam NEWS

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా ఇవ్వాలి

Murali Krishna

ప్రశ్నాపత్రాల లీకేజీతో విద్యార్థులకు అన్యాయం

Satyam NEWS

Leave a Comment