40.2 C
Hyderabad
May 2, 2024 15: 14 PM
Slider రంగారెడ్డి

భవన నిర్మాణ కార్మికులు బిఒసిడబ్ల్యు కార్డు పొందాలి

#JanSaahas

భవన నిర్మాణ రంగంలో పని చేసే ప్రతి కార్మికుడు బిఒసిడబ్ల్యు కార్డు పొందాలని జన్ సాహస్ సంస్థ వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాశ్ కుమార్ అన్నారు.

సోమవారం బొంరాస్ పెట్  మండల పరిధిలోని ముడిమామ్మీళ్ల తండా అనుబంద గ్రామమైన బండమీది తండా లో స్థానిక సర్పంచ్ బద్యా నాయక్ తో కలిసి బిఒసిడబ్ల్యు కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా జన్ సాహస్ సంస్థ వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

గుర్తింపు కార్డు ఉండటంతో ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ కూడా పొందుతారని తెలిపారు. ప్రభుత్వం ద్వార బిఒసిడబ్ల్యు కార్డు పొందితే  కార్మికుల కుటుంబంలో ఇద్దరు కూతుళ్ల పెళ్లికి ఖర్చులకు రూ.30 వేలు, ఇద్దరు కూతుళ్ల రెండు డెలివరీలకు  రూ.30 వేలు, ప్రమాదవశాత్తూ ప్రమాదంలో మరణిస్తే రూ.6లక్షల ప్రమాద భీమా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

శాశ్వత అంగవైకల్యం జరిగితే 5లక్షల భీమా, సహజ మరణానికి లక్షా ముప్పైవేల రూపాయల ప్రభుత్వ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని ప్రతి భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్ సాహస్  కో ఆర్డినేటర్ తేజ, నాయకులు చందర్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

పల్లె, పట్టణ ప్రగతి పథకాలతో ‘చివరి మజిలీ’కి తీరిన చింత

Satyam NEWS

భూకబ్జాదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

తెలంగాణ రాష్ట్రానికి మరో టెక్స్ టైల్  పరిశ్రమ

Satyam NEWS

Leave a Comment