37.7 C
Hyderabad
May 4, 2024 14: 09 PM
Slider ఖమ్మం

ముత్యాలమ్మ అమ్మవారికి జలాలతో జల యజ్ఞo

#Jala Yajna

ఖమ్మం చర్చి కాంపౌండ్ ముత్యాలమ గుడి సెంటర్ లో మండుతున్న భానుడు భారి నుండి సమస్త జనులను కాపాడాలని భారీ వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ దేవాలయం రజక సంఘం సభ్యులు 24 , 25 డివిజన్ నుండి బిందెలతో సుమారుగా 150 మంది ర్యాలీగా బయలుదేరి దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి జలాలతో , పాలతో అభిషేకం చేశారు .

అలాగే సంకల్ప బలంతో శాశ్వతంగా సకల జనుల తాగునీటి కష్టాలను మహాయజ్ఞం సంకల్పంతో తీర్చిన సీఎం కేసీఆర్ కు , అభివృద్ధి లో ఖమ్మం ను ముందంజలో ఉంచిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో గోలి రామారావు , చింతల రేణుక పంతంగి సైదులు , జీడిమెట్ల చిన్న , నెల్లుట్ల ఆనంద్ , జీడిమెట్ల మల్లేష్ మరియు అధిక సంఖ్యలలో మహిళలు పాల్గొన్నారు .

Related posts

రాజ్యాంగంతో అందరికి సమానత్వంను కల్పించిన మహనీయుడు అంబేద్క‌ర్

Satyam NEWS

దాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

Bhavani

వర్షం పడుతున్నా కొనసాగిన విజయనగరం పోలీసు శాఖ ‘స్పందన’

Satyam NEWS

Leave a Comment