29.7 C
Hyderabad
May 7, 2024 06: 16 AM
Slider విజయనగరం

వర్షం పడుతున్నా కొనసాగిన విజయనగరం పోలీసు శాఖ ‘స్పందన’

#deepikapatilips

రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర ను వర్షం ముంచెత్తుతందని “సత్యం న్యూస్. నెట్” చెప్పిన విధంగా పొద్దున్న నుంచీ విజయనగరం జిల్లా లో వర్షం పడుతునే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతీ వారం పోలీసు శాఖ నిర్వహించే “స్పందన” ను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్న ఎస్పీ దీపికా ఎం పాటిల్.. ఇవాళ 34 మంది బాధితుల మొరను ఫిర్యాదుల రూపంలో తీసుకుని ఆలకించారు.

ముఖ్యంగా విజయనగరం దాంతో పాటు రూరల్ నుంచీ బాధితులు తమ ,తమ బాధలను ఫిర్యాదుల రూపంలో ఎస్పీ దీపికా పాటిల్ తో పాటు ఏఎస్పీ సత్యనారాయణ లు స్వీకరించారు. ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు అందుకు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ల సిబ్బంది తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో సత్యం న్యూస్. నెట్ అందిస్తున్న బాధితులు ఫిర్యాదులు పోలీసు అధికారులు ఇచ్చిన ఆదేశాలు..మీ కోసం.

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదు దారులను న్యాయం చేయాలని ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ 34 ఫిర్యాదులను స్వీకరించి, బాధితులకు రశీదులను అందజేసి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.విజయనగరానికి చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి 75 వేలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించడం లేదని, డబ్బులు తీర్చాలని అడిగితే దౌర్జన్యంకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సీఐని ఆదేశించారు.

కొమరాడ మండలం, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ పూర్ణపాడు గ్రామంలో కొంత భూమిని కొనుగోలు చేసి, వ్యవసాయం చేసుకుంటున్నట్లు, ఇటీవల కొంత మంది వ్యక్తులు తన వ్యవసాయ భూమిని తిరిగి అమ్మాలని ఒత్తిడి చేస్తూ, తరుచూ గొడవలు పడుతున్నారని, వారి నుండి సదరు భూమి దురాక్రమణ కాకుండా చూడాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఇరువురికి కౌన్సిలింగు నిర్వహించి, ఫిర్యాదికి చట్ట పరిధిలో న్యాయం చేయాలని పార్వతీపురం సీఐను ఆదేశించారు.

విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి గాజులరేగకు చెందిన ఒకామె బంగారం కుదవ పెట్టుకొని 20 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, ఇంకనూ అప్పునకు సరిపడ బంగారు వస్తువులు ఇస్తామని చెప్పినప్పటికీ, గత 8 మాసాలుగా వడ్డీ కూడా చెల్లించకుండా తనను మోసం చేసారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని విజయనగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

విజయనగరం మండలం చెల్లూరు కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ఇంటి ముందు ప్రధాన రహదారి ప్రక్కన ఒక వ్యక్తి తోపుడు బండ్లు పెట్టి, వ్యాపారం చేస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను పిలిపించి, మాట్లాడి, చర్యలు తీసుకోవాలని విజయనగరం రూరల్ ఎస్ఐను ఆదేశించారు.

డెంకాడ మండలం పినతాడివాడ కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తన తండ్రి బ్రతికి ఉన్న కాలంలో కొంత వ్యవసాయ భూమిని వారి పెద బావ కుటుంబానికి కౌలుకు లీజుగా ఇచ్చినట్లు, తన తండ్రి మరణించిన తరువాత సదరు భూమికి వారి పెద బావ కుటుంబం కాజేయాలని ఉద్దేశ్యంతో తప్పుడు పత్రాలను సృష్టించి, వేరే వారికి రిజిస్ట్రేషను చేసేసినారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, డాక్యుమెంట్లును పరిశీలించి, ఫిర్యాదికి న్యాయం చేయాలని భోగాపురం సీఐను ఆదేశించారు.

గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ఇంటి ప్రక్కన నివాసం ఉంటున్న వ్యక్తితో ఇంటి గోడపై సమిష్టి హక్కు కలిగి ఉన్నట్లు,కానీ, తాము ఇల్లు నిర్మించే క్రమంలో సదరు గోడకు ప్లాస్టింగు చేసేందుకు ప్రయత్నించగా, సదరు వ్యక్తి పని వారిని అడ్డుకొని, నిర్మాణ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఇరువురికి కౌన్సిలింగు నిర్వహించి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం సీఐను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపిక ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  డీసీఆర్ బి సీఐ బి.వెంకటరావు, ఎస్బీ సీఐ జి. రాంబాబు, డీసీఆర్ బి ఎస్ఐలు నీలకంఠం, సూర్యారావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బిజెపి కసరత్తు

Sub Editor

వాయిదా పడనున్న ఐపీఎల్ మెగావేలం

Sub Editor

సమస్యలు సృష్టిస్తున్న వారి నుంచి మా భూములు కాపాడండి

Satyam NEWS

Leave a Comment