40.2 C
Hyderabad
May 5, 2024 15: 50 PM
Slider రంగారెడ్డి

జాన్ సహస్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిఎస్పీ

#Jan Saahas office

వలస కార్మికుల కొసం నిరంతరం పనిచేస్తున్న జన్ సాహస్ జిల్లా కార్యాలయాన్ని పరిగిలో జన్ సాహస్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, మాజీ జడ్పీటీసీ చంద్రయ్య లతో కలిసి పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సమయం నుండి జన్ సాహస్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సేవలందిస్తుందని తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో   ఇతర రాష్ట్రాల వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటే సంస్థ ద్వారా బస్సులను ఏర్పాటు చేసి పంపించారు. అదేవిధంగా బ్రతుకు దెరువు కొసం ఇతర రాష్ట్రాలకు వెల్లి లాక్ డౌన్ కారణంగా తిరిగి వచ్చిన కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, నిరంతరం వలస కార్మికుల కొసం పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం జన్ సాహస్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ మాట్లాడుతూ…వలస కార్మికుల కోసం పరిగి కేంద్రంగా జిల్లా కార్యాలయం ప్రారంభించామని తెలిపారు. జన్ సాహస్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు వలస కూలీలతో పాటు, స్థానికంగా పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలబడుతున్నదని పేర్కొన్నారు.

జన్ సాహస్ దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యపైన పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాశ్ కుమార్, లిగల్ సెల్ సభ్యులు కైసర్ పాషా, స్వెరొస్ జిల్లా అధ్యక్షుడు లక్నాపూర్ శ్రీనివాస్, కార్యదర్శి మంచన్ పల్లి శ్రీనివాస్, కో ఆర్డినేటర్లు అశోక్ నాయక్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మొగుళ్లపల్లి ఉపేందర్ కు ఉగాది పురస్కారం

Satyam NEWS

వదల బొమ్మాళీ నిన్నొదల: ఈటల నెత్తిన మరో పిడుగు

Satyam NEWS

మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన ఆసిఫాబాద్ ఎస్పీ

Satyam NEWS

Leave a Comment