37.2 C
Hyderabad
May 2, 2024 14: 14 PM
Slider ఆదిలాబాద్

మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన ఆసిఫాబాద్ ఎస్పీ

#asifabadsp

పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో నేడు ఎస్పీ పర్యటించారు. ప్రాణహిత పరివాహక , మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలయిన చింతలమానేపల్లి లో దిందా, చిత్తమా, గూడెం, కోయపల్లి, బెజ్జూరు మండలంలో సోమిని,మూగవెల్లి , పాపన్నపేట్, తలాయి గ్రామాలను ఆయన సందర్శించారు.

చింతలమానపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దిందా గ్రామం లోని  వాగుని సందర్శించారు. అక్కడి వాగు ఉప్పొంగి ప్రవహించడం వలన పాఠశాల పిల్లలు, ప్రజలు వాగు కు ఇవతలి వైపు ఉండటం వలన ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

తర్వాత చిత్తమ గ్రామం, కోయపల్లి, గూడెం  గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి,  ఎటువంటి అసాంఘిక శక్తులు  వచ్చిన కూడా వారికి సహాయం చేయవద్దని కోరారు. అలాంటి  వారి నుండి నష్టం తప్ప లాభం లేదని ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్ పి వివరించారు.

పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారనీ పేర్కొన్నారు.  చిత్త్తమా ప్రజలు పోలీస్ వారు వారి గ్రామానికి రోడ్డుకు మొరం వేసి బాగు చేసినందుకు వారు SP కి సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు.  కోయపల్లి  యువతకి వాలీబాల్ కిట్లు ఇవ్వడం జరిగింది.

ఇలా అత్యంత  మారుమూల ప్రాంతాలు పర్యటించి అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్నారు. తర్వాత మహారాష్ట్ర రాష్ట్రంలోని  గర్చిరోలి  జిల్లా ఐహెరి లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సందర్శించడం జరిగింది.

ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ అక్కడ డిఎస్పి అమూల్ ఠాగూర్, సిఐ శ్యామ్ గహరే లతో ముచ్చటించారు. రాష్ట్ర సరిహద్దుల మధ్య శాంతి భద్రతలు, సహకారం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు, డి.ఎస్.పి కరుణాకర్, కౌటాల సిఐ బుద్ధ స్వామి, చింతల మానేపల్లి ఎస్సై విజయ్  మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జాస్తి చలమేశ్వర్ కుమారుడికి కీలక పదవి ఇచ్చిన జగన్

Satyam NEWS

సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్

Satyam NEWS

క్రైమ్ స్టోరీ: మందు పోయిస్తావా చంపమంటావా?

Satyam NEWS

Leave a Comment