38.2 C
Hyderabad
April 29, 2024 22: 15 PM
Slider ముఖ్యంశాలు

82 లక్షల మంది విద్యార్థులకు “అమ్మబడి”

#ministerbotsa

82 లక్షల మంది విద్యార్థులకు “అమ్మబడి” రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈనెల 28న కురుపాంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి, తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తారని ప్రకటించారు. అనంతరం సుమారు వారం రోజులపాటు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా అమ్మ ఒడి పంపిణీ జరుగుతుందని తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో కొద్ది సేపటి క్రితం  మంత్రి  సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా జులై 1వ తేదీ నుంచి అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలు దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లను ఉచితంగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేస్తారని తెలిపారు. అధికార బృందాలు మండలంలో రోజుకి రెండు సచివాలయాల పరిధిలో పర్యటిస్తాయని వివరించారు

Related posts

విద్యల నగరంలో వ్యాపారి కిడ్నాప్…24 గంటలలో కేసు ఛేదింపు

Satyam NEWS

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్ల అభివృద్ధి

Satyam NEWS

ఊరూవాడా కదలి రాగా సత్యమేవ జయతే విజయవంతం

Satyam NEWS

Leave a Comment