40.2 C
Hyderabad
May 5, 2024 16: 03 PM
Slider ఖమ్మం

వాంటెడ్ జస్టిస్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

khammam 24

అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి సహకరించాలని  కోరతూ TUWJ  IJU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  ఖమ్మం జిల్లా కమిటీ  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వినతి పత్రం అందచేశారు. 

ఖమ్మంలో  ఆయన  క్యాంపు కార్యాలయంలో నేడు  సమస్యలతో  కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి స్వయంగా పలు సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చారని ఇందులో ప్రధానంగా జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉందని అయితే గడచిన ఆరేళ్లలో అది కార్యరూపం దాల్చలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.

అన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఈ జే హెచ్ ఎస్ పథకం ద్వారా హెల్త్ కార్డు లు  జారీ చేశారని అయితే పథకం ప్రారంభమైన మూడేళ్ళ వరకు ఆస్పత్రుల్లో సంతృప్తికరమైన వైద్య సేవలు అందాయని కానీ గత ఏడాదిన్నర కాలంగా ఒకటి రెండు ఆసుపత్రులు మినహా ఎక్కడ కూడా కార్డులు పని చేయటం  లేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  

దీంతో అప్పులు చేసి  వైద్యం చేయించుకోవలసిన  పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.  ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో  TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ, ఖమ్మం జిల్లా  జిల్లా అధ్యక్షుడు నర్వనేని వెంకట్రావు, రాష్ట్ర నాయకులు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇంకా వనం వెంకటేశ్వర్లు,  ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి కూరాకుల గోపి, ఉపాధ్యక్షులు ఆవుల శ్రీనివాస్,  యూనియన్ ఉపాధ్యక్షులు మోహిన్ ద్దీన్,  జనతా శివా,  ఉషోదయం శ్రీనివాస్,  కార్యనిర్వాహక కార్యదర్శి ఎగినాటి మాధవరావు,  కోశాధికారి జనార్దన చారీ,  ఖమ్మం నగర కన్వీనర్ మైసా పాపారావు,  ప్రెస్ క్లబ్  కార్యదర్శి తాల్లూరి మురళి కృష్ణ, యానియన్ నాయకులు రాయల బసవేశ్వరరావు,  గోపాలరావు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో త్వరలో నార్కోటిక్స్ స్పెషల్ వింగ్

Bhavani

కాజ్ ఆఫ్ డెత్ :నాతల్లి మరణానికి జాతీయ రహదారుల సంస్థే కారణమం

Satyam NEWS

ఆంజనేయుని ఆశీస్సులతో అంతా సుఖసంతోషాలతో జీవించాలి

Bhavani

Leave a Comment