29.7 C
Hyderabad
May 6, 2024 03: 09 AM
Slider మహబూబ్ నగర్

ఆంజనేయుని ఆశీస్సులతో అంతా సుఖసంతోషాలతో జీవించాలి

#Dr. V Srinivas Goud

ఆంజనేయుని దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం నాడు అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుగగా ఇవాళ ఆ అభయాజనేయుని రథోత్సవం కన్నుల పండుగగా జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

శుక్రవారం తెల్లవారుజామున స్థానిక పాలకొండలో జరిగిన అభయాంజనేయ స్వామి రథోత్సవంలో భాగంగా… దేవాలయంలో ఘనంగా పూజల నిర్వహించారు. హోమం, హారతి, స్వామి వారి ఊయల సేవ అనంతరం ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. పుర వీధుల గుండా సాగిన రథోత్సవంలో పాల్గొన్నారు. బాణసంచా వెలుగులతో రథోత్సవం కన్నులపండుగగా సాగింది. స్థానికులతో కలిసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.


గురువారం నాడు దేశమంతా హనుమాన్ జయంతి వైభవంగా జరుగగా… ఇవాళ తెల్లవారుజామున వందల ఏళ్ల చరిత్ర ఉన్న పాలకొండ అభయాంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరుగుతోందని తెలిపారు. ప్రజలంతా తెల్లవారుజామునే రథోత్సవానికి పెద్ద ఎత్తున హాజరయ్యారన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు మన పండుగలు నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు.

ఒకప్పుడు పాలకొండ అంటే ఎవరికీ తెలియదు. ఓ మారుమూల గ్రామంగా ఉండేదని ఇప్పుడు చెంతనే జాతీయ రహదారి, సమీపంలోనే బైపాస్, వీరి పరిధిలోనే కలెక్టరేట్ నిర్మాణంతో ఎంతో డిమాండ్ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు ఎంతో వెనకబడి, మారుమూల గ్రామంగా ఉన్న పాలకొండ నేడు హైదరాబాద్ లో సైతం కుగ్రామంగా ఉండి ఎంతో అభివృద్ధి చెందిన మణికొండను తలపిస్తోందని మంత్రి పేర్కొన్నారు. దగ్గర్లోనే ఐటీ పార్కు ఏర్పాటు కావడం వల్ల స్థానికులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని ఉద్యోగాలు చేసి సాయంత్రానికే ఇంటికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

గతంలో పంటలు పండక అన్నదాతలు ఆవేదన చెందే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, భూముల విలువ పెరిగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగడంతో స్థానికులు సంతోషంగా ఉన్నారన్నారు. భవిష్యత్ మహబూబ్ నగర్ ఇంకా అత్భుతంగా అవ్వాలని, అభయాంజనేయుడి దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఐక్యమత్యంతో జీవించాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, స్థానిక కౌన్సిలర్ మూస నరేందర్, బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడు ఆంజనేయులు, శ్రీశైలం, మాణిక్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కడపలో ఉన్నారా? మీకు కరోనా వస్తే ఇక అంతే…..

Satyam NEWS

సైమన్ కమీషనుకు గుండెలు చూపిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు

Satyam NEWS

మోహిని అలంకారం లో ఒంటిమిట్ట కోదండ రాముడు

Satyam NEWS

Leave a Comment