హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టచ్ పబ్ పై పోలీసులు దాడి చేశారు. ఆ పబ్ లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 22మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతులను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జూబ్లీ హిల్స్ టచ్ పబ్బులో పట్టుబడిన యువతుల హల్ చల్ సృష్టించారు. తాము ఎంతో పెద్ద కుటుంబాల నుంచి వచ్చామని తమను ఫొటోలు తీయవద్దని వారు అన్నారు. వారిని చిత్రీకరిస్తుండగా మీడియాపై దాడి చేశారు. మీడియా ప్రతినిధుల మొబైల్స్ నేలకేసి కొట్టిన యువతులు వారిపై కేకలు వేశారు.