31.2 C
Hyderabad
May 3, 2024 02: 03 AM
Slider సినిమా

“చిట్టిముత్యాలు – రొమాన్స్ విత్ రైస్” పేరు చాలా గట్టిగా వినిపిస్తుండడం సంతోషం

#romancewithrice

డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ టర్నడ్ “వంటల మాంత్రికుడు” కూచిపూడి వెంకట్

సినిమా రంగంలో సక్సెస్ ఇప్పటికీ ఆయనను ‘అందని ద్రాక్షపండు’లా ఊరిస్తూనే ఉంది. డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతూ… ఆయన తీసిన “మొదటి సినిమా” (సినిమా పేరే “మొదటి సినిమా”. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారానే పూనమ్ బజ్వా హీరోయిన్ గా పరిచయమయ్యింది), దర్శకనిర్మాతగా ఆయన తెరకెక్కించిన “జాన్ అప్పారావు 40 ప్లస్” (సిమ్రాన్ – కృష్ణ భగవాన్) రెండు సినిమాలూ విమర్శకుల ప్రశంసలు దండిగా పొందినప్పటికీ… కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దర్శకుడిగా అవకాశాల కోసం తిరగడం ఇష్టం లేక… సొంతంగా సినిమాలు తీసే స్థాయికి చేరుకోవాలనే కసి, పట్టుదలతో… హోటల్ ఇండస్ట్రీపై దృష్టి సారించి… ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి, అవిశ్రాంతంగా శ్రమించి… ఈ రంగంలో ఎన్నో అద్భుతాలు అలవోకగా ఆవిష్కరిస్తూ… “వంటల మాంత్రికుడు”, “అభినవ నల కుబేరుడు” అన్న బిరుదులు సంపాదించుకుని… ఈ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఆ దర్శకనిర్మాత పేరు “కూచిపూడి వెంకట్” !!

“ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి కిచెన్, రాజుగారి కోడి పలావ్, కూచిపూడి పలావ్, మారేడుమిల్లి” వంటి రెస్టారెంట్స్ తో ఈ రంగంలో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్న కూచిపూడి వెంకట్ తాజాగా తనదైన శైలిలో “రొమాన్స్ విత్ రైస్” అనే ట్యాగ్ లైన్ జోడించి “చిట్టిముత్యాలు” పేరుతో మరో పసందైన విందు భోజనశాలకు శ్రీకారం చుట్టారు. దిల్ రాజు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, టి.జి.విశ్వప్రసాద్ తదితర చిత్ర ప్రముఖుల చేతుల మీదుగా ఇటీవల ఎంతో ఘనంగా మొదలైన “చిట్టిముత్యాలు – రొమాన్స్ విత్ రైస్”కు భోజన ప్రియుల నుంచి వస్తున్న స్పందనను సినీ పరిభాషలో చెప్పాలంటే “బ్లాక్ బస్టర్” అని అభివర్ణించడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. హోటల్ రంగంలో “కూచిపూడి వెంకట్” అంటే ఇప్పుడు జస్ట్ నేమ్ కాదు… ఇట్సే బ్రాండ్ (It’s a Brand) !!

తన పేరు మీద కూచిపూడి వెంకట్ ఆవిష్కరించిన “కూచిపూడి పలావ్” ప్రపంచ హోటల్ చరిత్రలో ఒక అద్భుతం. చాలా తక్కువ ఖర్చుతో నిమిషాల్లో వేడి వేడి పలావ్ స్వయంగా చేసుకుని తినగలగడం “కూచిపూడి పలావ్” ప్రత్యేకత. అలాగే.. షెఫ్స్ అవసరం లేకుండా పలావ్ సర్వ్ చేయగలగడం ప్రపంచ హోటల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. తెలుగువాడి ఘనత ప్రపంచమంతా వినిపించేలా… “కూచిపూడి పలావ్” దేశవిదేశాల్లో అతి త్వరలో లభ్యం కానుంది. ఇక కూచిపూడి వెంకట్ కు హోటల్ రంగంలో ఎనలేని పేరు, గౌరవం తెచ్చిపెట్టిన “మారేడుమిల్లి” గురించి ఎంత చెప్పినా తక్కువే. అచ్చమైన, ఆహ్లాదకరమైన అటవీ వాతావరణాన్ని తలపిస్తూ… “వన భోజనానుభూతి”ని పంచుతున్న “మారేడుమిల్లి” రెస్టారెంట్ హైదరాబాద్ కు తలమానికంగా నిలుస్తోంది!!

పద్దెనిమిది వేల (18000) చదరపు అడుగుల సువిశాల వైశాల్యంలో, బ్యాంకెట్ హాల్ సదుపాయం కలిగి, అత్యంత ఆహ్లాదకర వాతావరణం (excellent Ambience), నోరూరించే వంటకాలతో … హైదరాబాద్ లోని మాదాపూర్ – హైటెక్ సిటీ నడుమ ఇమేజ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన “చిట్టిముత్యాలు” (రొమాన్స్ విత్ రైస్)కు వస్తున్న స్పందనపై దీని రూపకర్త కూచిపూడి వెంకట్ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. “నేను పెట్టే ప్రతి రెస్టారెంట్ కోసం నా ప్రాణం పెడతాను. కాబట్టి నేను స్టార్ట్ చేసే ప్రతి హోటల్ పెద్ద సక్సెస్. ఆ అనుభవసారాన్నంతట్నీ రంగరించి, మరింత ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దిన “చిట్టిముత్యాలు” కూడా ఒక రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మా అంచనాలను మించి “ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్” కావడం మాకు చాలా గర్వంగా ఉండడమే కాదు… మా బాధ్యతను మరింత పెంచింది” అంటున్నారు ఫుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ కూచిపూడి వెంకట్!!

“చిట్టిముత్యాలు” (Romance with Rice) కు గల మరో విశిష్టత ఏమిటంటే… కంప్యూటర్ రంగ నిపుణుడు – యువ మేధావి సిద్ధార్ద్ మండల సారథ్యంలో… కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ “షేక్స్పియర్” సంస్థ… “చిట్టిముత్యాలు” (రొమాన్స్ విత్ రైస్) రెస్టారెంట్ లో… ప్రపంచంలోనే ప్రప్రథమంగా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అగ్మెంటెడ్ రియాల్టీ వ్యవస్థను నెలకొల్పడం!! ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని… సంప్రదాయాన్ని మేళవించుకుని నోరూరించే రుచులతో ఘుమఘుమలాడుతూ కొలువుదీరిన “చిట్టిముత్యాలు” (Romance with Rice) హైదరాబద్ హోటల్ రంగంలో ఓ “మణిహారం”గా భాసిల్లడం ఖాయం!!

Related posts

ఏపీ లో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు

Satyam NEWS

విద్యార్ధులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

Satyam NEWS

వ్యధాభరిత జీవనం

Satyam NEWS

Leave a Comment