Slider కరీంనగర్

డెవెలప్మెంట్ ఫండ్స్: రూ.50 కోట్లనిధులతో పలు అభివృద్ది పనులు

jagityal mla

రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సుప్రభాత్ హోటల్ లో ఆదివారం అయన విలేకరులతోమాట్లాడుతూ నర్సింగ్ కళాశాలకు రూ.15 కోట్లు, నూతన కలెక్టర్ సముదాయానికి రూ.50 కోట్లు, రూ.15 కోట్లతో ఆసుపత్రిలో 100 పడకల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పట్టణానికి రోజుకు కోటి నలభై లక్షల మిషన్ లీటర్ ల భగీరథ నీరు సరఫరా అవుతోందని, అన్ని కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయిస్తున్నామని, 75 శాతం బడుగు బలహీన వర్గాలకు మున్సిపల్ టికెట్లు కేటాయిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని వెల్లడించారు. గత పాలకుల నిర్లక్ష్యం వలననే పట్టణం అస్తవ్యస్తంగా తయారయిందని ఎమ్మెల్యే అన్నారు

Related posts

హిందీ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం

Satyam NEWS

అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదానం చేయండి

Satyam NEWS

అన్ని గురుకులాల్లో డిజిటల్ లెర్నింగ్ వసతులు

Satyam NEWS

Leave a Comment