37.2 C
Hyderabad
May 6, 2024 21: 11 PM
Slider తెలంగాణ

16 రానున్న జుడిషియల్ కమిషన్ సభ్యులు

sajjanar

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ హత్య కేసుకు సంబంధించి నిందితుల ఎన్‌కౌంటర్ జరిగి నెల రోజులు పూర్తి కావొస్తుంది. కాగా ఈ కేసుకు సంబంధించి సత్వర విచారణ చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 16న హైదరాబాద్‌కు రానుంది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితులకు సంబంధించిన రీ పోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్‌బృందం షీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు సమర్పించింది.

షాద్‌నగర్ పోలీసులు వారం రోజుల్లో దిశ కేసులో ఫైనల్ రిపోర్ట్‌ను మహబూబ్‌నగర్ ఫాస్ట్రాక్‌కోర్టుకు సమర్పించనున్నారు. దిశ నిందితులు ఎన్‌కౌంటర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ సిపి మహేశ్‌భగవత్ ఆధ్వర్యంలో సిట్‌ఏర్పాటైన సంగతి తెలిసిందే.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే అనేక సాక్ష్యాలను సేకరించిన సిట్‌త్వరలోనే జ్యుడిషియల్‌ కమిషన్‌ను కలిసి సేకరించిన సాక్ష్యాలను సమర్పించనుంది.

ఇదిలావుండగా గతేడాది దిశపై అత్యాచారం, ఆపై హత్య చేసిన సంఘటన దేశ్యాప్తంగా సంచలనం సృష్టించింన విషయం విదితమే. దిశ కేసులో మహ్మద్‌ఆరిఫ్,శివ,నవీన్, చెన్నకేశవులు ప్రధాన నిందితులు చటాన్‌పల్లి వంతెన వద్ద సీన్‌రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నించిచడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు నిందితులు అక్కడిక్కడే హతమయ్యారు.

Related posts

ధర్మపురిలో కన్నుల పండువగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం

Satyam NEWS

తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు

Murali Krishna

కంప్లయింట్: మలాలా చిత్ర దర్శకుడికి ఫత్వా

Satyam NEWS

Leave a Comment