పైలెట్ చాకచక్యంతో ఎయిర్ కెనడాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి అపాయం జరగకుండా అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం తో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు . విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్ కు సంబంధించిన ఓ చక్రం ఊడిపోయింది.
విండో పక్కన కూర్చున్న ఓ ప్యాసెంజర్ ఈ విషయాన్ని గమనించి వెంటనే పైలెట్ కు తెలిపాడు . దీంతో పైలెట్ చాకచక్యంగా విమానాన్ని రన్‌వేపై ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని ఎయిర్ కెనడా వెల్లడించింది.