Slider మహబూబ్ నగర్

జూపల్లి యువసేన రక్తదాన శిబిరానికి విశేష స్పందన

#JupallyKrishnaRao

ప్రతి ఒక్కరు సామాజిక దృక్పథంతో ఆపద సమయాల్లో సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల ఆవిర్భావ వేడుకలు, జూపల్లి ప్రజాభియాన్ పాదయాత్ర 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూపల్లి యువసేన కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన మెగా రక్త దాన శిబిరం విజయవంతం అయింది.

 మొదట రక్తదానం చేసి మాజీమంత్రి జూపల్లి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా యువకులు కార్యకర్తలు స్వచ్చందగా తరలివచ్చి రక్తదానం చేశారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వరకు నిర్వహించిన ఈ శిబిరానికి యువకులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్సాహంగా తరలివచ్చారు.

రక్తదానం చేసేందుకు 100 మంది వరకు సిద్ధంగా ఉన్నా కూడా లాక్ డౌన్ నేపధ్యంలో రెడ్ క్రాస్ సంస్థ వారి సూచన మేరకు 53 మంది నుంచి మాత్రమే రక్త దానం చేసేవీలు కల్పించారు. మిగతా వారు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అవకాశం లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ రక్తదానం మహాదానమని ఇలాంటి శిబిరాలతో యువత చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు.

Related posts

లాహోర్‌లో పేలిన బాయిలర్.. ముగ్గురు మృతి..

Sub Editor

స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్లాంక్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా మీనా

Satyam NEWS

Leave a Comment