Slider తెలంగాణ

తెలంగాణలో కరోనా ఉద్ధృతితో నేడు ఐదుగురి మృతి

#Gandhi Hospital

తెలంగాణలో కరోనా కారణంగా నేడు ఒక్కరోజే ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 45కి పెరిగింది. కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 26 కేసులను జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు.

మరో రెండు కేసులు రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూశాయి. మరో 10 మంది వలస కార్మికులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. నేడు 23 మంది డిశ్చార్జి కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,036కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 618 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Related posts

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

కవచ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

Satyam NEWS

పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment