Slider ముఖ్యంశాలు

హైకోర్టు న్యాయమూర్తి రజనీ సేవలు అందరికీ ఆదర్శం

#JusticeMaheswari

న్యాయ వ్యవస్థ  ద్వారా సమాజానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ టి.రజని అందించిన సేవలు అందరికీ ఆదర్శమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి అన్నారు.

నవంబరు 5తో రజనీ పదవీ కాలం పూర్తి కావడంతో గురువారం హైకోర్టు సమావేశ మందిర ఆవరణలో (వర్చువల్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి హాజరయ్యారు.

ఆయనతో పాటుగా పలువు హైకోర్టు న్యాయమూర్తులు నేరుగా జరిగిన అభినందన సభలో పాల్గొనగా, న్యాయ వ్యవస్థకు చెందిన  కొందరు అతిధులు వీడియో వర్చువల్ కాన్ఫిరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి మాట్లాడుతూ జస్టిస్ టి.రజని వంటి ధైర్యవంతురాలు న్యాయ వ్యవస్థలో పని చేయడం అభినందనీయమన్నారు.

ఆమె తెలివితేటలు న్యాయ వ్యవస్థ పటిష్టతకు ఎంతో దోహద పడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు. జస్టిస్ రజని సూచనలు, సలహాలను నేటి న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉపయోగించుకోవాలని పిలుపు నిచ్చారు. అభినందన సభలో యూనియన్ ఆఫ్ ఇండియా సోలిసిటర్ జనరల్ అసిస్టెంట్ హరినాథ్,రాష్ట్ర అడ్వికేట్ జనరల్ ఎస్.శ్రీరామ్,రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఘంటా రామారావు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇన్ చార్జీ అధ్యక్షులు జె.యు.ఎం.వి.ప్రసాద్ లు రాష్ట్ర హైకోర్టు జస్టీస్ రజనీ సేవలను కొనియాడారు.

న్యాయ వ్యవస్థ పటిష్టతకు అంత:కరణ శుద్ధితో పని చేయాలి

హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ టి.రజనీ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పటిష్టతకు అంత:కరణ శుద్ధితో ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపు నిచ్చారు. తన 18ఏళ్ళ సుధీర్ఘ న్యాయ వ్యవస్థ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా లో జన్మించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి గుంటూరు జిల్లా న్యాయమూర్తిగా  విధుల్లో చేరి,హైకోర్టు న్యాయమూర్తిగా 18ఏళ్ళ పని చేయడం గొప్ప అదృష్టమని అన్నారు.

ఇప్పుడున్న న్యాయమూర్తులు,న్యాయవాదులు అంతా న్యాయం,ధర్మంతో పాటుగా అంత:కరణ శుధ్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. చట్టం చెప్పే అంశాలను పాటిస్తూ,మానవతా వాదంతో,ఆత్మ సాక్షిగా తీర్పులు ఇవ్వాలని సూచించారు. ప్రతీ ఒక్కరికీ న్యాయం జరగాలన్నదే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రారులు, అసిస్టెంట్ రిజిస్ట్రారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనాథ బాలబాలికలకు రగ్గులు దుప్పట్ల పంపిణీ

Satyam NEWS

శని, ఆది, సోమ…. మారిన ఉద్యోగ సంఘాల నేత మాటలు

Satyam NEWS

పుత్త ఎస్టేట్ లో టీడీపీ కార్యాలయం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment