38.2 C
Hyderabad
May 2, 2024 19: 07 PM
Slider కడప

పెద్ద దర్గా ఉరుసుకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు

kadapa dargha

కడప నగరంలోని ప్రసిద్ధి చెందిన పెద్ద దర్గా ఉరుసు 28 నుండి జనవరి 2 వ తేదీ వరకు జరగనున్ననేపథ్యంలో జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప డి.ఎస్.పి బి.సునీల్ తెలిపారు. నగరంలోని పెద్ద దర్గాలో పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్త్ పై డి.ఎస్.పి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ఉరుసు ఉత్సవాలకు హాజరయినప్పటికీ పోలీసు శాఖ పకడ్బందీ భద్రతా చర్యలు చేపడుతుందన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, సేవాతత్పరతతో విధులు నిర్వర్తించాలని డి.ఎస్.పి ఆదేశించారు. బందోబస్త్ లో నలుగురు సి.ఐ లు, 10 మంది ఎస్.ఐ లు, ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో పాటు స్పెషల్ పార్టీ, మహిళా మిత్ర, సేవాదళ్, బాలమిత్రలు కూడా పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల్లో మహిళలకు ప్రత్యేకంగా సేవలందించేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా వారికి ట్యాగులు వేస్తామ‌న్నారు. ట్యాగులు వేయడం ద్వారా వారు తప్పిపోయేందుకు అవకాశం ఉండదన్నారు.

ఈ కార్యక్రమంలో కడప నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు దర్గా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ఇలా గుంపులు గుంపులుగా …..మ‌రి అలాగైతే వైర‌స్ కు అడ్డ‌కట్ట ఎలా..?

Satyam NEWS

ఎన్నిక‌ల‌కు తెర‌దించిన హైకోర్టు తీర్పు.. ఎన్ఈసీ నిమ్మ‌గ‌డ్డ

Sub Editor

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment