40.2 C
Hyderabad
May 2, 2024 18: 01 PM
Slider విజయనగరం

ఇలా గుంపులు గుంపులుగా …..మ‌రి అలాగైతే వైర‌స్ కు అడ్డ‌కట్ట ఎలా..?

#virus

ఏపీలోని ఉత్తరాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా విద్య‌ల న‌గ‌రంగా ఖ్యాతి పొందిందిగాని…అవ‌గాహ‌న‌,ముందు చూపు లేద‌ని క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా తేట‌తెల్ల‌మైంది. జిల్లా మూడు శాఖ‌లు మ‌రీ ముఖ్యంగా రెవిన్యూ,వైద్య‌,పోలీస్ శాఖ‌లు సంయుక్తంగా ప‌ని చేస్తున్నాయి కాబ‌ట్టే  18 గంట‌ల పాటు లాక్ డౌన్ అమ‌ల‌వుతున్నా…కేసుల సంఖ్య స‌రాస‌రి అయిదు వంద‌ల లోపే న‌మోద‌వుతున్నాయి.

కానీ..ఆ ఆరుగంట స‌డ‌లింపులో  మాత్రం ప్ర‌జ‌లు ఇష్టాను సారంగా…నిబంద‌న‌లు అతిక్ర‌మించి…జారీ చేసిన నియ‌మాల‌ను ఉల్ల‌ఘించి  నిసిగ్గుగా తిరుగుతున్నారు. చూడిండి..వీళ్లంతా ఆధార్ నెంబ‌ర్ కు టెలీఫోన్ నెంబ‌ర్ ను అనుసంధానం కోసం విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద ఉన్న టెలీఫోన్ ఎక్సేంజ్ కు వ‌చ్చారు.

ఉద‌యం ఆరుగంట‌ల‌కే వ‌చ్చిన వీరంతా…గుంపులు,గుంపులుగా సోష‌ల్ డిస్ట‌న్స్ పాటించ కుండా కుమ్మేసుకుంటూ ఇలా  గంద‌ర‌గోళం సృష్టించారు. ఎంట్రీ గేటు వ‌ద్ద‌..టెలీఫోన్ సిబ్బంది….ముందుగానే ఉండి వినియోదారుల వ‌ద్ద నుంచీ అప్లికేష‌న్లు తీసుకోవ‌డానికి సిద్ద ప‌డినా….క‌నీసం అత‌ని వ‌ర్క్ అత‌న్ని చేయకుండా  మీద ప‌డ‌టంతో  ఎంత చెప్పినా వినియోగ‌దారులంతా వినిక‌పోవడంతో అక్క‌డ నుంచీ వెళ్లిపోయారు.

ఇక అక్క‌డ‌కు కొంచెం దూరంలో టెలీఫోన్ భ‌వ‌న్ వినియోగ‌దారుల సేవా చెల్లింపు కేంద్రంలో టెలీఫోన్ ఉద్యోగి సిద్దంగా ఉన్నా ఏ వినియోగ దారుడూ సోష‌ల్ డిస్ట‌న్స్ కానీ,శానిటైజ‌ర్ వేసుకుని రావ‌డం కాని అక్క‌డ ప‌ని చేస్తున్న టెలీఫోన్ ఉద్యోగ‌స్థులు చూడ‌లేదు.

అయితే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లుగా వినియోగ‌దారుల మీద ఆరోప‌ణ‌లు చేయ‌కుండానే ఉండేందుకు టెలీఫోన్ శాఖ గేట్ ఎంట్ర‌న్స్ వ‌ద్ద సీసీ కెమారాలు అమ‌ర్చించింది.అలాగే వినియోగ‌దారుల చెల్లింపు సేవా కేంద్రం వ‌ద్ద కూడా మ‌రో  సీసీ కెమారాను అమ‌ర్చింది.

ఇదిలా ఉంటే…ఇన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా వీటిని ప‌రిశీలించే అధికారి పట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ కూడా వినిపిస్తోంది. టెలీఫోన్  క‌మ‌ర్ష‌య‌ల్ విభాగ‌పు అధికారిణి… వినియోగ‌దారుల చెల్లింపులు, క‌రోనా వైరస్ రాకుండా నివార‌ణ చ‌ర్య‌లు అందుకు చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను రెండురోజుల కొక సారి పరిశీలించాల్సి  ఉంటుంది.

ఓవైపు వినియోగ‌దారులకు సేవ‌లు మ‌రోవైపు శాఖ తీసుకుంటున్న చ‌ర్య‌లు చేప‌డుతున్నా…వినియోగ‌దారుల గుంపులు ద్వారా క‌రోనా  వైర‌స్  మ‌రింత‌గా సోకితే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు..?  టెలిపోన్ శాఖ‌…?  లేక వినియోగ‌దారులా..? అదీ కాకుండా…పోలీసులా..?  లేక డాక్ట‌ర్లా…?

Related posts

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతి

Satyam NEWS

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ కోఆర్డినేటర్ గా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

ప్లాస్మా దానానికి అందరూ సిద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment