33.2 C
Hyderabad
May 14, 2024 14: 27 PM
Slider సినిమా

“కాంతారా” కోవలో “కలివీరుడు”

#Kaliveera

కె.జి.ఎఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ “కాంతారా”తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. “కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ… రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది!!

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని… “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. “అవి” దర్శకత్వంలో… రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు.

“కాంతారా” కోవలో “కలివీరుడు” తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు!! ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పోస్టర్స్: విక్రమ్ ఎ.హెచ్ – అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం: హలేష్ ఎస్, ఎడిటర్: ఎ.ఆర్.కృష్ణ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రాఘవేంద్ర, నిర్మాత: ఎమ్.అచ్చిబాబు, రచన – దర్శకత్వం: అవి!!

Related posts

మంగళగిరి కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

Satyam NEWS

‘టిక్ టాక్’ ను మరిపించేలా “ME 4 Tic Tic” యాప్

Satyam NEWS

తెలుగు భాష కనుమరుగవకూడదన్న తపన

Satyam NEWS

Leave a Comment