40.2 C
Hyderabad
April 28, 2024 16: 31 PM
Slider ముఖ్యంశాలు

తెలుగు భాష కనుమరుగవకూడదన్న తపన

#Ambareesh

ప్రస్తుతం మన చిత్రపరిశ్రమలో పెర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యత కలిగిన మధ్య వయసు పాత్ర అనగానే చప్పున స్ఫురణకు వస్తున్న పేరు “అప్పాజీ అంబరీష”.

ఏజెంట్ సాయి శ్రీనివాస్, గద్దలకొండ గణేష్ (వాల్మీకి), భీష్మ, భానుమతి రామకృష్ణ” వంటి పలు చిత్రాల ద్వారా ఇప్పటికే తనకంటూ ఓ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అప్పాజీ నటించిన దాదాపు డజను చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉండగా.. మరో అరడజను చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

నటుడిగా ఇంత బిజీగా ఉండి కూడా… ఫాంట్స్ రూపకల్పనలో సిద్ధహస్తులైన అంబరీష.. తాజాగా ఓ ఇరవై యూనికోడ్ ఫాంట్స్ క్రియేట్ చేసి… అందరూ ఉచితంగా వాడుకోవడానికి వీలుగా అందుబాటులోకి తెచ్చేందుకు నడుం కట్టారు. పలు ప్రముఖ దినపత్రికల ఫాంట్స్ రూపకర్త అయిన అప్పాజీ అంబరీష.. ఇప్పటికే పది రకాల యూనికోడ్ ఫాంట్స్ రూపొందించి.. తెలుగు భాషకు తన వంతు సేవలందించారు.

ఒక కొత్త ఫాంట్ క్రియేట్ చేయడానికి సుమారు 600 నుంచి 700 పని గంటల సమయం వెచ్చించాల్సి వస్తుందని, మొత్తం ఇరవై ఫాంట్స్ కోసం 14 వేల గంటల క్వాలిటీ టైమ్ కేటాయించాల్సి వస్తుందని.. అందుకే ఇందుకోసం విరాళాలు సేకరిస్తున్నానని వెల్లడించారు అప్పాజీ అంబరీష.

తెలుగు భాషను ప్రేమించేవారంతా ఇందులో భాగస్వాములు కావాలని అప్పాజీ పిలుపునిచ్చారు. ఈ అక్షర క్రతువులో పాలుపంచుకోవాలనుకునేవారు దిగువ పేర్కొన్న అకౌంట్ లో తమ విరాళాన్ని జమ చేయవచ్చు. తెలుగు భాషకు సేవ చేసినవాళ్లలో  తన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతోనే ఈ అక్షర యజ్ఞం చేపట్టానని వినమ్రంగా చెబుతున్న అప్పాజీ అంబరీషను ప్రోత్సహించడం తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది??

You can also do a bank transfer to the below mentioned account: Account number: 2223330048964140

Account name: Appaji Ambarisha D

IFSC code: RATN0VAAPIS

https://milaap.org/fundraisers/support-appaji-ambarisha-d?utm_source=whatsapp&utm_medium=fundraisers-title&mlp_referrer_id=54311

Related posts

రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

డాక్టర్ మోహన్ కు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం

Satyam NEWS

మతకలహాలు సృష్టించే ఫేక్ వార్తలను కట్టడి చేయాలి – Fake news in social media telugu

Satyam NEWS

Leave a Comment