26.7 C
Hyderabad
May 15, 2024 09: 22 AM
Slider వరంగల్

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం వాయిదా

#Kaloji Kalakshetra

ఈ నెల 8 వరకూ వర్షాలే ఉన్నందున హనుమకొండ లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంల ప్రారంభం వాయిదా పడినట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. గురువారం కుడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాత్కాలికంగా కాళోజీ కళాక్షేత్రం వాయిదా పడినా త్వరలోనే సిఎం, మంత్రుల తేదీలతో ప్రారంభం ఘనంగా జరుపుకుంటామన్నారు. 9న కాళోజీ జయంతి సందర్భంగా హరిత కాకతీయ హోటల్ లో కాళోజీ పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రజాకవి జయరాజుకు అందజేయనున్నట్ల తెలిపారు. తెలంగాణ కోసం, పేదల కోసం తపించిన కాళోజీ నారాయణరావును తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి గొప్పగా చూస్తున్నారన్నారు.

కాళోజీ ఆకాంక్షల ప్రకారం సాకారమైన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ గౌరవాన్ని మరింత పెంచేలా సీఎం కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాళోజీ శతజయంతి సందర్భంగా వరంగల్ రూ.50 కోట్లతో 2.25 ఎకరాల్లో రాష్రంలోనే అతిపెద్ద కళా కేంద్రాన్ని నిర్మించేందుకు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. కాళోజీని అన్ని తరాలు గుర్తుంచుకునేలా రాష్ర్టంలోని ఏకైక హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు పెట్టారు. కాళోజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రఖ్యాత కళాకారులకు అవార్డు ఇస్తున్నదన్నారు.

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వేగవంతమైందని,త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ 9న హరిత హోటల్ లో ఉదయం కాళోజీ అవార్డు ప్రదానం, మద్యాహ్నం కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ విలేఖరుల సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రాష్ట్ర రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నగర కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా, కవులు, రచయితలుపాల్గొన్నారు, కాళోజీ పౌండేషన్ ప్రతినిధులు అంపశయ్య నవీన్, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, పి. అశోక్ కుమార్, కుడా పివో అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే

Satyam NEWS

కష్టపడి పని చేసేవారికి గతంలో కొన్ని జబ్బులు వచ్చేవి కావు

Satyam NEWS

హిందువులను హింసిస్తున్న పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారా?

Satyam NEWS

Leave a Comment