37.2 C
Hyderabad
May 2, 2024 11: 05 AM
Slider ప్రత్యేకం

త్యాగం తెలంగాణ ప్రజలది భోగం కల్వకుంట కుటుంబానిది

#khammam

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను దోచుకుంటున్న ఈ ప్రాంతం వారిని పాతర రవేయాలని, తెలంగాణ ఉద్యమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే విధంగా జరిగిందని,ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వేలాదిమంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు.

త్యాగం తెలంగాణ ప్రజలది భోగం కల్వకుంట్ల కుటుంబానిదని విమర్శించారు. బంగారు తెలంగాణ అని కల్లబొల్లి కబుర్లు చెప్పి కల్వకుంట్ల కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుందని విమర్శించారు. దళిత బంధు పేరుతో నలుగురికి సాయం చేసి దళిత జాతి మొత్తాన్ని ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు మోసకారి మాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని దళిత బంధు పథకంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని దళారులే రాజ్యమేలేరని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల ప్రాజెక్టుగా మార్చిలక్షల కోట్ల రూపాయలు గంగపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిపోయిందని,ధరణి వ్యవస్థను తెచ్చి రైతులను గోసపెడుతున్నారని దీంతో రైతుల మధ్య వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. నిరుద్యోగులను నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిలువునా మోసం చేశారని లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కల్వకుంట్ల కుటుంబం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి అండగా నిలబడాలని ఉద్యమకారులంతా కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపించాలని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ ,1969 ఉద్యమ నాయకులు కోయ వెంకట్ ,నారాయణ, మెరుగు పుల్లయ్య, వేపూరి సత్యనారాయణ, తీగల రాములు, సంగయ్య, నల్లెల లక్ష్మీనారాయణ కొర్రి ముత్తయ్య, గురునాథం, భువనగిరి నరసింహారావు, కె అప్పారావు, వెంకన్న బి. నర్సయ్య, కొత్త వెంకటరెడ్డి, బి. రామారావు లింగయ్య ఉపేందర్, వెంకటి, వెంకటేశ్వర్లు వేపూరి నాగేశ్వరరావు, నరసింహాచారి, కూరపాటి కృష్ణమూర్తి, కుమ్మరి సంధ్యారాణి కుమ్మరి వెంకటేశ్వర్లు, కూరపాటి భద్రయ్య, తాటికొండ శ్రీనివాసరావు, నూకమ్మల సతీష్, వెంకటేశ్వర్లు, బులికొండ పాపయ్య కృష్ణ సాగర్, వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Satyam NEWS

నెలకు 300మంది వృత్తి దారులకు సాయం

Bhavani

Who killed Babai: సీబీఐ తీరును ప్రశ్నిస్తున్న తెలుగుదేశం

Satyam NEWS

Leave a Comment