కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి వేల మంది భక్తులు తరలివచ్చారు. మండల పూజల కోసం శబరిమల ఆలయం గురువారం సాయంత్రం తెరుచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నూతన అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. రెండు నెలల పాటు కొనసాగే మణికంఠుడి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
previous post