33.2 C
Hyderabad
May 4, 2024 00: 47 AM
Slider ముఖ్యంశాలు

ఇంటింటికీ  కల్యాణలక్ష్మి

#kalyanalaxmi

షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 98-చెక్కులకు రు.98 లక్షలు ఇంటింటికీ మోటార్ సైకిల్ పై స్వయంగా వెళ్లి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 2,3వ పట్టణంలో మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కులను ఆయా డివిజన్లలోని లబ్ధిదారుల కుటుంబాలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెక్కులను స్వయంగా మోటార్ సైకిల్ పై వెళ్లి పంపిణీ చేశారు.

వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు ఉదయం 2వ టౌన్, మధ్యాహ్నం 3వ టౌన్ నందు మొత్తం 98 చెక్కులను గాను రూ.98 లక్షల విలువైన చెక్కులను మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్లి లబ్దిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. ఆయా లబ్దిదారులకు మంజూరైన రూ. లక్ష చెక్కుతో పాటు చీర, పండ్లు అందజేశారు. దీంతో లబ్దిదారులు తమ వద్దకే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్వయంగా చెక్కును ఇవ్వడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ఇంటి అడపిల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడొద్దు అనే సంకల్పంతో ముఖ్యమంత్రివర్యులు నిర్ణయం తీసుకుని నిరంతరాయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి సంక్షోభం వచ్చిన నేటి వరకు సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా పథకాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు దేశంలోనే ఎక్కడ లేవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఆదర్శమని మంత్రి అన్నారు. మంత్రి వెంట నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, సుదా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డోరెపల్లి శ్వేత, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంజాబ్ కార్మిక నేత నౌదీప్ కౌర్ కు బెయిల్ మంజూరు

Satyam NEWS

విజయనగరం పోలీసులకు ఫిట్ నెస్ జిమ్ ప్రారంభం

Satyam NEWS

హెటిరో ల్యాబ్స్ ను సందర్శించిన సీబీఐటీ విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment