30.7 C
Hyderabad
April 29, 2024 05: 24 AM
Slider ఖమ్మం

మంచి దృక్పథమే విజయానికి సోపానం

#lokadalat

మంచి దృక్పథంతో ఏదైనా పనిని ప్రారంభిస్తే విజయం ఖచ్చితంగా వరిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైన సందర్భంగా న్యాయమూర్తి ఖమ్మం న్యాయ సేవాసదన్ లో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు.

అభినందించటం వలన పని చేసిన వారు ఇంకా ఎక్కువ కష్టపడతారని పని చేయని వారు స్ఫూర్తి పొందుతారని ఆయన అన్నారు. అటెండర్ నుంచి అధికారి వరకు ప్రతి ఒక్కరూ చేసిన కృషి ఫలితం గానే అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించినట్లు ఆయన అన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్. డానీ రూత్ మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తి దిశా నిర్దేశనం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో 153 సివిల్ కేసులు పరిష్కారం అవటం ఆనందదాయకం అన్నారు.

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు మాట్లాడుతూ ఇకముందు కూడా లోక్ అదాలత్ల విజయానికి న్యాయవాదుల నుంచి సహకారం ఉంటుందన్నారు… అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను, పోలీసు అధికారులను, న్యాయవాదులను భీమా కంపెనీ అధికారులను న్యాయశాఖ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు డి. రాంప్రసాదరావు, ఎం అర్చనా కుమారి, వి, అపర్ణ, -ఎన్ అమరావతి, కే ఆషారాణి ఎన్ శాంతి సోని, ఆర్ ఆశాలత న్యాయవాదులు ఎం నిరంజన్ రెడ్డి, బి -గంగాధర్, ఆర్ హరి ప్రసాద్, జి హరేందర్ రెడ్డి, కె రామారావు, వీరేందర్ జసీతారామారావు, ఎస్ రాంబాబు భీమా కంపెనీ అధికారులు కే సంధ్య, ఈ మహేష్, వార్తాపత్రికలకు సంబంధించిన లీగల్ కంట్రిబ్యూటర్లు జిల్లా కోర్టు పరిపాలనాధికారి సూర్యనారాయణ నాజర్ కె రాజే శ్యాం, సాంకేతికాధికారి ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏడు వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ వెల్లడి

Bhavani

ఆశా వర్కర్ పై జరిగిన దాడికి ములుగులో నిరసన

Satyam NEWS

Leave a Comment