19.7 C
Hyderabad
December 2, 2023 05: 08 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ పోటీతో కామారెడ్డికి మహర్దశ

కామారెడ్డి ప్రజలు అదృష్టవంతులని, సీఎం కేసీఆర్ పోటీతో కామారెడ్డికి మహర్దశ రానుందని రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, ఎలాంటి ఆటంకాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కులవృత్తులకు ప్రోత్సాహకం అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాజ పండుగలను విశ్వవ్యాప్తం చేశామన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారిందని, కొత్త కలెక్టరేట్, పోలీసు భవనాలు వచ్చాయని, త్వరలో 8 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించుకోబోతున్నామన్నారు.

100 కోట్లతో పట్టణ అభివృద్ధి జరిగుతుందని, త్వరలో దాని ఫలాలు అందనున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ మతాల పేరు చెప్పి పబ్బం గడుపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చిందని బీజేపీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఒక్క చాన్స్ అని అడుగుతుందని, కర్ణాటకలో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి బాగలేక చేతులెత్తేసిందన్నారు.

తెలంగాణలో రైతుబంధు, రైతుభిమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు, ఫ్రీ కరెంట్, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇండస్ట్రీలు వచ్చాయని, ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. మనఊరు-మనబడి, మనబస్తీ-మన దవాఖాన కార్యక్రమాలు గొప్పవన్నారు.

7200 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదన్నారు. తెలంగాణలో వరిసాగు గతంలో 65 లక్షల క్వింటాలు ఉంటే ఇప్పుడు 3 కోట్లకు పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో ఆయనను ఊహకందని మెజారిటీతో గెలిపించుకోవాలని, సీఎం గెలిస్తే కామారెడ్డి రూపురేఖలు మారుతాయన్నారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అమలుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ విషయం ప్రస్తుతం పెండింగులో ఉందన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి వస్తున్నారని రైతులకు భరోసా ఉంటుందన్నారు. రైతుల భూములు ఎక్కడ పోయినా ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ మాస్టర్ ప్లాన్ పెండింగులో ఉందని, సీఎం కేసీఆర్ ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారన్నారు.

బీజేపీ గజ్వేల్ టూర్ పై స్పందిస్తూ.. పనికిరాని చెత్త వేదవలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారన్నారు. గజ్వేల్ అభివృద్ధి కామారెడ్డిలో రిపీట్ అవుతుందన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ వాల్లవి చిన్న పిల్లల చేష్టలని, వాళ్ళు ఏ ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలన్నారు. అది చెప్పుకునే ధైర్యం లేదని, చిల్లర పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ప్లాట్లు వస్తాయని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో వైద్య పోస్టులు ఖాళీ లేవని, అక్కడక్కడ ఉంటే భర్తీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

రాష్ట్రంలో చేపల ఉత్పత్తి ఊహించని విధంగా పెరిగిందన్నారు. చేప పిల్లల సైజ్, క్వాంటిటీ బాధ్యత సొసైటీలదేనని తెలిపారు. ఈ విషయాన్ని సొసైటీలకు కూడా చెప్పామన్నారు. కర్ణాటకలో ఒడిపోయామని ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఒడిపోతామన్న భయంతోనే కేంద్రం జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ కమిటీ వేసిందన్నారు. ఏ ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తుపెట్టుకోమని, సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తామన్నారు.

Related posts

పవన్ కు జనసేన ఎమ్మెల్యే వెన్నుపోటు

Satyam NEWS

నష్టాల్లో ఉంటే విశాఖ ఉక్కును ప్రయివేటు వాళ్లు ఎలా నడుపుతారు?

Satyam NEWS

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!