40.2 C
Hyderabad
April 29, 2024 18: 32 PM
Slider ప్రత్యేకం

ఈ బఫూన్లు చెబితే చంద్రబాబు బెయిల్ రద్దు చెయ్యాలా?  

#raghurama

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతున్న కొంత మంది చెట్టు కింది న్యాయవాదులు, ముందు షరతులను ఉల్లంఘించిన  జగన్ బెయిల్ ను ఏమి చేయాలో చెప్పాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించడమే కాకుండా, ఎంతోమందిని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు.

బెయిల్ రద్దు చేయమని కేసు వేసిన తనలాంటి వారిని చంపాలని చూశారన్నది నిజం. కోర్టుకు విచారణకు హాజరు కావడం లేదనేది నిజం. కోర్టుకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు చేయాలని కోర్టు షరతు విధించిన మాట నిజం. ఏ నిజాన్ని కూడా ఆ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నది నిజం… ఈ నిజాలన్నింటినీ ప్రజా కోర్టు ముందు ఉంచుతున్నాను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. న్యాయస్థానాలలో ఏమి జరుగుతుందో ననేది తెలియదన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రఘురామకృష్ణంరాజు  తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సాక్షి దినపత్రికలో  వైకాపా పార్టీకి చెందినవారు, చెట్టు కింద ప్లీడర్ల అభిప్రాయాలను, ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయాలన్నట్టుగా ప్రచురించడం హాస్యాస్పదంగా ఉంది.

చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆయన బెయిల్ షరతులను ఉల్లంగించారని సాక్షి బఫూన్స్ అంతా కలిసి న్యాయవ్యవస్థను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు..  చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులను  ఉల్లంఘించినట్లుగా పెన్ డ్రైవ్ ద్వారా సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం, ఆయన ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. రోడ్డుమీద ఎవరైనా మహానుభావులు వస్తే, ప్రజలు రోడ్డు మీదకు వారిని చూసేందుకు  రావడం ఖాయం. మనమైతే డబ్బులు ఇచ్చి జనాలను తోలుకు రావాలి. 

జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన  నారా చంద్రబాబు నాయుడు గారిని తిలకించడానికి జనం విచ్చేస్తే, న్యాయ మూర్తులు ఏమి చేస్తారని ప్రశ్నించారు. రోగం కారణంగా బెయిల్ వచ్చిందని కొందరు మాజీ మంత్రులు వ్యాఖ్యానించారు. మరి మీకు ఏ రోగం వచ్చిందని సాక్షి దినపత్రికలో ఇటువంటి చెత్త రాతలను రాస్తున్నారు. కండిషన్లను ఉల్లంఘించిన కారణంగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని ఎవరైతే చెట్టు కింద ప్లీడర్లు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారో, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ కండిషన్లలో ఒకటైన  కంపల్సరిగా కోర్టుకు హాజరు కావాలని  ఆదేశించారు.

కానీ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మూడు వేల పదిహేడు సార్లు కోర్టుకు హాజరు కాకుండా  వాయిదా కోరారు.  నేను ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. అత్యవసరమైతేనే కోర్టు విచారణ జగన్మోహన్ రెడ్డి గారిని  పిలవాలని  ఆరు నెలల క్రితం హైకోర్టు ఆర్డర్  ఇచ్చింది. అంతకుముందు ఆయన ఎన్నిసార్లు పిలిచినా   కోర్టు విచారణకు హాజరు కాలేదు. అప్పుడే అతని బెయిల్ రద్దు చేయాల్సిందని రఘురామకృష్ణం రాజు గారు అన్నారు. బెయిల్ రద్దు చేయలేదంటే సిఐడి కోర్టును  మేనేజ్ చేశారా? అని మేము మనవచ్చా?? అంటూ నిలదీశారు. 

జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించాలంటూ చెట్టు కింది ప్లిడర్లకు ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విచారణకు పిలిచినా, ఏసీబీ కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి  గారి తరహాలో వాయిదా  కోరలేదన్నారు. కోర్టు విచారణకు  హాజరుకాకుండా  ఎన్నోసార్లు గైరాజరైనా  జగన్మోహన్ రెడ్డి గారి  బెయిల్ ఎందుకు రద్దు చేయలేదు.  ఇదే విషయమై  న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నన్ను పోలీసుల చేత కొట్టించి, వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందించారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

సాక్షులను ప్రభావితం చేయవద్దని  బెయిల్ కండిషన్లలో పేర్కొన్నప్పటికీ, అన్ని కేసులలో A2 నిందితుడైన విజయసాయి రెడ్డి కి  రాజ్యసభ సభ్యత్వం  ఇచ్చారు. ఇంకొక కేసులో అప్పటి మంత్రి సహా నిందితునిగా  ఉండగా ఆయనకు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. ఇంకొక కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిని ఆంధ్రకు తీసుకొచ్చి పక్కనే పెట్టుకున్నారు. ఎంతోమంది నిందితులకు బ్రహ్మాండమైన  లబ్ధి జగన్మోహన్ రెడ్డి చేకూర్చారని అన్నారు. సిమెంటు పోర్టల్ లో  లయన్  షేర్ జగన్మోహన్ రెడ్డి కంపెనీ దైతే,  సహా నిందితుల కంపెనీల వే   ఇతర షేర్లు. సహా నిందితులు కాని వారు సిమెంటు  కంపెనీ ఎక్కడ సిమెంటు పోర్టల్ లో  ఉందని ప్రశ్నించారు.

ఎక్కడికక్కడ  సాక్షులను ప్రభావితం చేస్తూ, కేసు వేసిన వారిపై  దేశద్రోహం కేసు నమోదు చేసి, లాకప్ లో చిత్రహింసలు పెట్టారు. అయినా ఇవేమి న్యాయస్థానానికి కనపడలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పై సిబిఐ అభియోగాలను మోపి చార్జిషీట్లను దాఖలు చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లతో  కోర్టు సమయాన్ని మింగేస్తూ, ఎంతమందికి ఏమి మింగిస్తున్నారు తెలియదు. పదేళ్లుగా  11 చార్జి సీట్లలో ఉన్న 100 మంది  వ్యక్తులు, డిశ్చార్జ్ పిటిషన్లను వేస్తుండడం వల్ల ఇప్పటివరకు  ట్రయల్ కూడా మొదలు కాలేదు. డిశ్చార్జి పిటిషన్ పూర్తి అయ్యే వరకు కేస్ పెండింగ్ అని అంటారు.

చట్టంలోని లోసుగులను వాడుకొని  పదేళ్లుగా డిశ్చార్జ్  పిటిషన్లు వేస్తూ, కాలయాపన చేస్తున్నారు. దీనితో ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి. 11 చార్జిషీట్ కేసులలో A1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేరం ఒప్పుకుంటారా? లేదా?? అన్నది తేలిన తర్వాతే నేను నేరం ఒప్పుకోనని చెబితే ట్రయల్ ప్రారంభమవుతుందన్నారు.. సిబిఐ తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాది, డిఫెన్స్ న్యాయవాదిగా జగన్మోహన్ రెడ్డి తరపున, నిరంజన్ రెడ్డి , మరొకరో కేసును వాదిస్తూ ఉండవచ్చు. వాదనలు జరగాలంటే ఇంకో పదేళ్ల  సమయం పట్టవచ్చు.

దీనికి అంతం ఏప్పుడో ?. సిబిఐ కోర్టులో  దారుణం జరుగుతోందని నేను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాను. హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి  గారిని  అత్యవసరమైతేనే విచారణకు పిలవాలని వెలువరించిన  నేపథ్యంలో, కోర్టు మారుస్తారా?, త్వరగా విచారణ పూర్తి చేయమని ఆదేశిస్తారా??, లేకపోతే బెయిల్ క్యాన్సల్ చేస్తారా??? అన్నది చూడాలన్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని  ప్రజలు కోరుతున్నారు. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన చంద్రబాబు నాయుడు గారిని తిలకించడానికి జనం వస్తే,, న్యాయమూర్తులు ఏమి చేస్తారన్న  వారు ప్రశ్నిస్తున్నారన్నారు .

Related posts

Official Cbd Oil Clinical Studies Cbd Lion Hemp Source

Bhavani

అశోక్ బంగ్లా నుండీ “భవిష్యత్తు కై టీడీపీ బస్ యాత్ర” ప్రారంభం…!

Bhavani

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం

Satyam NEWS

Leave a Comment