37.2 C
Hyderabad
April 30, 2024 14: 04 PM
Slider నిజామాబాద్

సెల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి టాప్: జిల్లా ఎస్పీ సిందూశర్మ

#cellphone

సీఈఐఆర్ అప్లికేషన్ల ద్వారా సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ సిందూశర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఫ్లూ చోట్ల ఆకస్మికంగా పడిపోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల యజమానులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో సీఈఐఆర్ అప్లికేషన్లో పోయిన మొబైల్ ఫోన్లను నమోదు చేయగా ఇప్పటికే 1053 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందచేయడం జరిగిందని తెలిపారు.

బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలో 442, కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో 398, ఎల్లారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో 213 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ రికవరీలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం మొదటి స్థానంలో ఉందని, కమీషనరేట్స్ తో కలిపితే కామారెడ్డి జిల్లా ఐదవ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లాలో సెల్ ఫోన్ రికవరీలో బాన్సువాడ పోలీసు స్టేషన్ మొదటి స్థానంలో కామారెడ్డి రెండవ స్థానంలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియ చేసి సీఈఐఆర్ అప్లికేషన్లో నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో సెల్ ఫోన్ల రికవరీకి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

దేశ రైతుల మేలు కోసమే నూతన చట్టాలు

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

Satyam NEWS

చలితో గజగజలాడుతున్న ఉత్తరభారతం

Bhavani

Leave a Comment