32.7 C
Hyderabad
April 27, 2024 02: 13 AM
Slider ముఖ్యంశాలు

దేశ రైతుల మేలు కోసమే నూతన చట్టాలు

MLARaghunandan

రైతులకు మేలు చేసేందుకే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.

కొత్త చట్టలతో మోడీకి పేరు వస్తుందన్న కారణంతోనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్డులో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనను జిల్లా అధ్యక్షురాలు అరుణ తార శాలువతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాలం చెల్లిన, బూజు పట్టిన చట్టాలను తొలగించి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తెస్తుందన్నారు. కొత్త చట్టాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ మార్కెట్లో అందరూ తమకు నచ్చిన ధరలకు అమ్ముకుంటుంటే కేవలం రైతులకు మాత్రమే ఎందుకు బంధనాలు ఉండాలని, రైతులకు ఉపయోగపడేలా ఉండే ఓపెన్ మార్కెట్ సిస్టంను ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించారు.

అంబానీ, ఆధానిలు ఇప్పుడే ఢిల్లీకి వచ్చారా.. 2014 మే 26 కు ముందు లేరా అని నిలదీశారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిగా, రాజ్యాంగ విలువలను కాపాడుతూ, ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అంత్యోదయా విధానమే లక్ష్యంగా పిడికిలి చట్టాలను ఖచ్చితంగా సవరిస్తామని, ప్రజలకు లాభం చేకూర్చేలా చట్టాలను సవరించి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

 ఆవిధంగా వచ్చినవే ఈ మూడు వ్యవసాయ చట్టాలని చెప్పారు. పార్లమెంటులో అందరితో చర్చించిన తర్వాతనే నూతన చట్టాలను తీసుకువచ్చామని, ప్రజాస్వామ్య బద్దంగా తెచ్చిన ఈ చట్టాల ద్వారా ప్రధాని మోదికి మాత్రమే ఎక్కడ పేరు వస్తుందేమోనని భయంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు.

తెలంగాణలో బీజేపీ నే ప్రత్యామ్నాయం

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఉంటుందన్న ఆయన బీజేపీని అధికారంలోకి తెచ్చేలా ముందుకు సాగుతామని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కవిత, దుబ్బాక ఎన్నికల్లో హరీష్ రావు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ లకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తప్పుడు విధానాలను ఎండగడుతూ టిఆర్ఎస్ కళ్ళు తెరిపిస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని, అదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ బాద్యులు బాణాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

ఏపీ లో 20న రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

Satyam NEWS

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటీవ్

Satyam NEWS

నిత్యావసర వస్తువులతో పాటు మాస్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment