30.7 C
Hyderabad
May 5, 2024 04: 39 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ‘కంటివెలుగు’

#hyderabadpressclub

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘కంటివెలుగు ‘లో భాగాంగా సోమవారం నాడు సోమాజిగూడ లోని హైదరాబాద్  ప్రెస్ క్లబ్ లో  జర్నలిస్టులకు ప్రత్యేక  కంటి వెలుగు  కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.జె.వెంకటి నేతృత్వంలోని  బృందం జర్నలిస్టులకు,వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు చేశారు.

కంటి వెలుగు  శిబిరాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు, ప్రధానకార్యదర్శి  రవికాంత్ రెడ్డి ప్రారంభించారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రావు, సంయుక్త కార్యదర్శి చిలుకూరి  హరిప్రసాద్, కోశాధికారి ఏ .రాజేష్ లు కంటివెలుగు శిబిరాన్ని పర్యవేక్షించారు. మొదటి రోజు 160 మంది జర్నలిస్టులు పరీక్షలు చేయించుకున్నారు. కొంతమందికి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు చెప్పారు.120 మందికి కళ్ళ అద్దాలు పంపిణీ చేశారు. మంగళవారం కూడా కంటి వెలుగు  శిబిరం జరుగుతుందని ,జర్నలిస్టు మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షకార్యదర్శులు కోరారు.

Related posts

గంగమ్మ ఆలయంలోని పురాతన స్తంభాలను పునర్నిర్మించాలి

Satyam NEWS

భద్రాచలం ప్రసాదం రేట్లు పెంపు

Satyam NEWS

సంజయ్ కి ఉరిశిక్షపై సీఐ కి అభినందనల వెల్లువ

Satyam NEWS

Leave a Comment