42.2 C
Hyderabad
May 3, 2024 17: 08 PM
Slider విజయనగరం

ఒక వైపు 25 ఏళ్ల యువకుడు, మరోవైపు ఇద్దరు పిల్లల తల్లి…

#vijayanagarampolice

విజయనగరం వన్ పోలీసు స్టేషన్ పరిధిలో  ఆత్మహత్యలు..!కారణాలేంటో…?

విజయనగరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో వన్ టౌన్ పోలీసు స్టేషన్ అత్యంత కీలకమైనది.డిప్యూటీ స్పీకర్, విద్యాశాఖ మంత్రలుంటున్న నివాసిత ప్రాంతంలో అను నిత్యం నిఘాతో పాటు ఎన్నో కేసులతో నిత్యం రద్దీ గా ఒకవైపు బాధితులు, మరోవైపు… ఆందోళన కారుల తో బీజీబిజీగా ఉంటున్న ఆ పీఎస్ లోనే ఒకే రోజు రెండు ఆత్మహత్య లకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.. సీఐ డా.వేంకటరావు ,ఎస్ఐ లు భాస్కర రావు, అశోక్ లు.

అసలు ఏంటా ఆత్మహత్యలు.. ఎవరు చేసుకున్నారీ అఘాయిత్యాలని…”సత్యం న్యూస్. నెట్” నేర పరిశోధన చేయగా..ఆసక్తి కరమైన అంశాలు..వెలుగు చూసాయి. 25 ఏళ్ల సంజయ్ నాయుడు.. నగరంలో ఉడాకాలనీలో ప్రాంతంలో ఓ అయిదేళ్ళ అపార్ట్ మెంట్ నుంచీ ప్రాణార్పణం చేసుకుంటే…అదే నగరంలో మరో ప్రాంతంలో ఓ ఇద్దరు పిల్లల తల్లి మమత…భర్త ,కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను కాదని బలవన్మరణంకు పాల్పడింది.

రెండు అఘాయిత్యాలపై పోలీసులే సుమోటోగా కేసు లను నమోదు చేసుకునే యత్నం లో ఉన్నారు. ఇక ఉడాకాలనీ 25 ఏళ్ళ కుర్రాడి ఆత్మహత్య విషయంలో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో యువకుడి కన్ళవాళ్లు ..వన్ టౌన్ పీఎస్ కు వచ్చి.. కన్న కొడుకు మృతి పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. కుర్రాడు మృతి పై అనుమానాలు వ్యక్తం కావడం ఒకవైపు… ఇద్దరు పిల్లల తల్లి మృతి పై ఆమె బంధువులు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో… వన్ టౌన్ పోలీసులు… రెండు అంశాలలో వాస్తవాలను తెలుసుకునే యత్నం లో ఉండటం…”సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి కి కనిపించడం జరిగింది.

Related posts

తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ కార్డుల డిస్ట్రిబ్యూషన్‌

Bhavani

వైజాగ్ స్టీల్ ఉద్యమంలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

బడ్జెట్ సెషన్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్?

Satyam NEWS

Leave a Comment