29.7 C
Hyderabad
May 4, 2024 03: 58 AM
Slider ఖమ్మం

పకడ్బందీగా కంటివెలుగు

#kantivelugu

నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తుంది. ఖమ్మం జిల్లాలో కంటి వెలుగు పథకం ద్వారా, జిల్లాలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు లక్ష్యంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పర్యవేక్షణలో సూక్ష్మ కార్యాచరణ ప్రణాళిక చేసి, ఆచరణకు పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 125 డివిజన్/వార్డులు ఉండగా, గ్రామీణoగా 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్ని 100 రోజుల్లో కవర్ చేయుటకు (55) కంటి వెలుగు బృందాలు ఏర్పాటుచేసి, ఒక్కో బృందంలో ఒక వైద్యాధికారి, ఒక ఆప్టోమెట్రిస్ట్ తోపాటు 6 నుండి 8 మంది సహాయక సిబ్బంది అంటే సూపర్వైజర్, ఏఎన్ఎం, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆశా వర్కర్ లు వుంటారు ప్రతి బృందానికి ఒక వాహనం ఏర్పాటుతో పాటు, జిల్లాలో 2 బఫర్ బృందాలు సిద్ధంగా ఉంచడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటుచేసి, కార్యక్రమ అమలు పర్యవేక్షణ చేయడం జరుగుచున్నది. గ్రామ పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, రైతు వేదికలు మొదలగు చోట్ల కంటి వెలుగు శిబిరాల ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరంలో ఆటో రిఫ్లాక్టో మీటర్, ట్రయల్ లెన్స్ బాక్స్ విత్ ఫ్రెమ్, స్నేల్లెన్ చార్ట్, టార్చిలైటు తదితర అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచి, మౌళిక వసతుల కల్పన చేయడమైనది. కంటి పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి రీడింగ్ కళ్ళద్దాలు పరీక్ష అయిన వెంటనే అందించడం, ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు అవసరం వారికి వారం పది రోజుల్లో వారి వారి ఇళ్ల వద్దకే అందేలా పటిష్ట కార్యాచరణ చేపట్టినట్లు, అవసరమైన వారికి ఆపరేషన్లకు చర్యలు తీసుకుంటున్నారు.  

ఖమ్మం జిల్లాలో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 2018లో 32 కంటి వెలుగు బృందాలను ఏర్పాటు చేసి, 6 లక్షల 31 వేల 361 మందికి కంటి పరీక్షలు చేపట్టడం జరిగింది. రోజుకు సరాసరి 140 మందికి పరీక్షలు చేపట్టి, 1 లక్షా 2 వేల 350 మందికి రీడింగ్ కళ్ళద్దాలు, 66 వేల 691 మందికి ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు అందించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి  వరకు 46 వేల 547 మందికి కంటి పరీక్షలు చేపట్టడం జరిగింది. అందులో 21 వేల 738 మంది పురుషులు, 23 వేల 517 మంది స్త్రీలు, 16 మంది ట్రాన్సజెండర్లు వున్నారు. ఇందులో 23 వేల 911 మంది కంటి సమస్యలు లేనివారు ఉండగా, 13 వేల 812 మందికి రీడింగ్ కళ్ళద్దాలు పరీక్షలు జరిగిన వెంటనే అందించగా, అవసరమైన 8 వేల 778 మందికి ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు వారం, పది రోజుల్లో వారి వారి ఇండ్ల1వద్దకే అందేలా చర్యలు చేపట్టడం జరిగింది.

Related posts

పస్రా లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

Satyam NEWS

సి ఐ టి యు జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలి

Satyam NEWS

కేదార్ నాథ్ ఆలయంలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ

Satyam NEWS

Leave a Comment