29.7 C
Hyderabad
May 2, 2024 04: 37 AM
Slider ముఖ్యంశాలు

సి ఐ టి యు జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలి

#cituhujurnagar

హైదరాబాదులో నవంబర్ 16, 17, 18, తేదీలలో జరిగే సిఐటియు జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని, అందుకు కార్మిక వర్గం, ప్రజాతంత్ర వాదులు తోడ్పాటు అందించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సి ఐ టి యు సమావేశంలో పాల్గొని యాదగిరి రావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడి చేస్తుందని, సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడలుగా చేయటం కార్మికులను బానిసల చేస్తుందని,కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ కౌన్సిల్ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.

అసెంబ్లీ పరంగా కార్మికులకు సమగ్ర వేతన చట్టం చేయాలని,ఈ శ్రమ లో కార్మికుల పేర్లు నమోదు కొరకు లేబర్ అధికారులను సమాయత్తం చేయాలని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ నుండి కాపాడాలని, రాష్ట్ర లోని షెడ్యూల్డ్ పరిశ్రమలను కాపాడాలని,అందులో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,ఎస్ కె రణమియ,ఎస్ కె బాబు,అశోక్,గోపి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పెంచిన అదనపు కరెంటు బిల్లులను రద్దు చేయాలి

Satyam NEWS

మైనారిటీల ద్రోహి సీఎం జగన్ రెడ్డి: మహ్మద్ ఇక్బాల్

Satyam NEWS

ఈనెల 19 నుంచి తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ సమ్మె

Satyam NEWS

Leave a Comment