38.7 C
Hyderabad
May 7, 2024 16: 23 PM
Slider వరంగల్

అసాధ్యం అనుకున్న కాళేశ్వరాన్ని పూర్తి చేసిన కేసీఆర్

dayakar 02

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో, గిరిజన సంక్షేమ శాఖ జూనియర్ కాలేజి ప్రారంభం, స్కూల్ అదనపు తరగతి గదులు ఏర్పాటు కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు, గిరిజన- శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి దయాకర్ రావు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మరొకసారి నెమరువేసుకున్నారు. ఇందులో భాగంగా రైతు సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలకు కేసీఆర్ ప్రభుత్వానికి తేడా మీరే చూడాలని ప్రజలకు గుర్తుచేశారు. అసాధ్యం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తి చేసి పొలాలలకు నీళ్లు ఇస్తున్నారు.

మిషన్ భగీరథతో అన్ని గ్రామాలకు నీళ్లు ఇస్తున్నారు. 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నారు.గ్రామాల సమగ్ర వికాసం కోసం సీఎం కెసిఆర్ ఇప్పుడు పల్లె ప్రగతిని చేపట్టారు. పాడైన రోడ్ల మరమ్మతుల కోసం సీఎం కేసీఆర్ రూ.570 కోట్లు కేటాయించారన్నారు.గ్రామపంచాయతీ నిధుల ఖర్చు చెక్ పవర్ విషయంలో ఎవరికీ అనవసర ఆందోళనలు వద్దు. తప్పులు, అక్రమాలు చేసిన వారు ఎవరైనా వదిలేదిలేదని తెలిపారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు ఎన్నో రకాల అధికారాలు ఇచ్చింది. సర్పంచ్ పదవి గొప్ప గుర్తింపు. దానితో మీ గుర్తింపు పెరగాలని సర్పంచ్ లకు హితబోధ చేశారు. కేసిఆర్ నాయకత్వంలో గ్రామాల్లో ఎన్నో పనులు చేసే అవకాశం వచ్చింది.ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. సర్పంచులు చొరవ తీసుకుని ఈ పనులు పూర్తి చేయాలి.గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ చాలా ముఖ్యం. పరిశుభ్రతతోనే రోగాల నిర్మూలన సాధ్యమవుతుంది. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత నిర్మించాలి.

గ్రామాల అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.అన్ని విషయాల్లో మంచి పనితీరు ఉన్న గ్రామపంచాయతిలకు సొంత భవనాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.కొత్త గ్రామపంచాయతీలలో 20 శాతం జీపీలకు మొదటి దశలో భవనాలు నిర్మిస్తామన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకుని ట్రాక్టర్ నిర్వహణ నిధులను సర్ధుబాటు చేసుకోవాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పల్లె ప్రగతి స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

Related posts

ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత

Satyam NEWS

మహిళల భద్రతకు 20 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలు, మినీ వ్యాన్

Satyam NEWS

ఫారెస్ట్ ఆఫీసర్ బైక్ దగ్ధం

Bhavani

Leave a Comment