ఇటీవల బయో డైవర్సిటీ బ్రిడ్జి పై నుండి కారు ఫల్టీలు కొట్టిన సంఘటనలో మృతిచెందిన నాగప్రణీత కుటుంబానికి పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ను జీహెచ్ ఎం సి మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం అందజేశారు. అలాగే ఈ ప్రమాదం లో తుంటి ఎముక విరిగి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కుబ్ర బేగం కు అందిస్తున్న వైద్యసేవలకీ రూ. 3.50 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకు అయ్యే వైద్య ఖర్చును జీహెచ్ ఎం సి తరుపున భరించనున్నట్లు మేయర్ తెలిపారు.
previous post
next post