40.2 C
Hyderabad
April 29, 2024 18: 54 PM
Slider చిత్తూరు

మహిళల భద్రతకు 20 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలు, మినీ వ్యాన్

#disapolice

మహిళల భద్రత కోసం 20 ద్విచక్ర వాహనాలు, దిశ మినీ వ్యాన్ ప్రారంభించినట్లు తిరుపతి అర్బన్ ఎస్ పి సి.హెచ్.వెంకట అప్పల నాయుడు పేర్కొన్నారు.

మహిళల పై జరిగే నేరాలు అరికట్టేందుకు ‘దిశ’ పోలీస్ స్టేషన్ కు మినీ వ్యాన్, దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను కేటాయించామని తెలిపారు.

స్థానిక పోలీస్ గ్రౌండ్ లో అడ్మిన్ అడిషనల్ యస్.పి. సుప్రజాతో కలిసి ఈ వాహానాలకు జెండా ఊపి ప్రారంభించారు.

తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా లో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో మహిళ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

మహిళలపై జరిగే నేరాలను అత్యంత ప్రాధాన్యత గా పరిగణించామని, కేసులను త్వరితగతిన పరిష్కారించడంతో బాటు నిర్ణీత వ్యవధిలోనే ఛార్జిషీట్లు దాఖలు చేసి బాధితులకు న్యాయం, నిందితులకు శిక్షపడేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఘటనా స్థలంలోని ఆధారాలను సమగ్రంగా సేకరించి భద్రపరిచేందుకు ప్రత్యేక కిట్స్ ఈ మినీ వ్యాన్ లో ఉంటాయన్నారు. దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాల వల్ల మహిళల భద్రతకు భరోసా కల్పించనున్నామని తెలిపారు.

ఈవ్ టీజింగ్ , వేధింపులు నియంత్రించేలా ఈ వాహనాల్లో సంచరించడం, విద్యాసంస్థలు, దేవాలయాలు, శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వేయడం, మహిళా నేరాలు జరుగకుండా ముందస్తు కట్టడి చర్యలు చేపట్ఠేందుకు వీలవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో డి.యస్.పి. లు రామరాజు దిశ, కొండయ్య కంట్రోల్ రూమ్, సుధాకర్ తిరుమల సి.సి.ఎస్. దిశ పోలీస్ స్టేషన్ సిబంది పాల్గొన్నారు.

Related posts

అల వైకుంఠ పురములో రాములో రాములా

Satyam NEWS

లేఖ‌రుల‌కు లైసెన్సులు ఇప్పించాలి

Sub Editor

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల‌కు వేత‌నాల పెంపు

Satyam NEWS

Leave a Comment