40.2 C
Hyderabad
May 6, 2024 18: 03 PM
Slider ముఖ్యంశాలు

4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ దే

#harish rao

రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘటన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 517 ఎకరాలకు గాను 610 మంది గిరిజనులకి పోడు పట్టాల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.4 లక్షల ఎకరాల పోడు భూములను పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

కాంగ్రెస్ వాళ్లు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు, కనీసం వారికి త్రీ ఫేజ్ కరెంట్ కనెక్షన్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లు పది శాతానికి పెంచారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి త్రీ ఫేజ్ కరెంట్ గిరిజన తండాలను అందించారని గుర్తు చేశారు.

ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం 3,146 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. గిరిజనుల కష్టాలు చూసిన కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 3146 తండాలను ఆదివాసీ గూడేలను పంచాయతీలు గా మార్చారని అన్నారు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఏ నాయకుడు వచ్చినా మోదీతో సహా కేవలం సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తిట్టుడే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం ఏంటని ప్రశ్నించారు.

Related posts

సుప్రీంకోర్టు తీర్పు: మళ్లీ ప్రధాన మంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్

Satyam NEWS

రిటైర్డ్ ఉద్యోగుల సంఘo సేవలు అభినందనీయం

Bhavani

రిజర్వేషన్లను 77 శాతానికి పెంచాలి

Satyam NEWS

Leave a Comment