28.7 C
Hyderabad
May 6, 2024 00: 22 AM
Slider ముఖ్యంశాలు

బాలింతలలో రక్తహీనత నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్

errabelli

రాష్ట్రంలోని 9 జిల్లాలోని గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ లోపాన్ని నివారించేందుకు కేసిఆర్ న్యూట్రీషియన్ కిట్ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా ఇరవై వేలమంది మహిళలు ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

జానపద రంగస్థల కళకు ప్రాణం పోసిన మఠంపల్లి వాసి డాక్టర్ గుంటి పిచ్చయ్య

Satyam NEWS

రెడీ: స్థానిక సంస్థల ఎన్నికలకు విశాఖ జిల్లా సిద్ధం

Satyam NEWS

శోభాయాత్రకు అందరూ సహకరించండి

Satyam NEWS

Leave a Comment