37.2 C
Hyderabad
May 6, 2024 13: 36 PM
Slider రంగారెడ్డి

బీఆర్‌ఎస్‌ గెలుపుకై ప్రతి ఒక్కరు పని చేయాలి

#bandari

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనే తెలంగాణకు  శ్రీరామరక్ష అని బీఆరెస్ ఉప్పల్ శాసన సభ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఈసీఎల్ లోని పరివార్ హోటల్  నందు ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్య కార్యకర్తల, నియోజకవర్గ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగినది. ఈ సమావేశానికి  ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్  ఎన్నికల  ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సమావేశం ఉప్పల్ బి ఆర్  ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలు ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్లో టిఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమని ఉప్పల్ ఎన్నికలు ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో  పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం  అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పేదలు అన్ని వర్గాల సంక్షేమం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,  రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా  వంటి పథకాలు  ప్రవేశపెట్టిన ఘనత  సీఎం కేసీఆర్ కు దక్కుతుంద న్నారు. గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో  చేయని అభివృద్ధి.. గత తొమ్మిది సంవత్సరాల్లో రెట్టింపు అభివృద్ధి జరిగింద న్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో.. భావితరాలకు బంగారు బాట వేసే దిశగా ప్రయత్నం చేస్తుందన్నారు.

 రానున్న  ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని, అలాగే ఉప్పల్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి, కడప గడపకు తీసుకెళ్లి  కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే.. కుటుంబానికి పెద్ద దిక్కుగా అందరికీ అందుబాటులో ఉండి కష్టనష్టాల్లో తోడుంటానని  భరోసా కల్పించారు.

ప్రతి కార్యకర్తను బీఆర్‌ఎస్‌ హక్కున చేర్చుకుంటుందని, బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటులేదన్నారు.

పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబిసీ చైర్మన్ తాడూరి శ్రీనివాసరావు, కార్పొరేటర్ లు పన్నాల దేవేందర్ రెడ్డి, జర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, గొల్లూరి అంజయ్య,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు  కాసం మైపాల్ రెడ్డి, గంధం నాగేశ్వరరావు, గోపు సదానంద్, గజ్జల సత్యరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

వేసవి పంటలలో నీటి యాజమాన్యం ఇలా చేయాలి

Satyam NEWS

ఆద్యంతం వర్షం… తడుస్తూనే విజయనగరం ఉత్సవాలు నిర్వహణ…

Satyam NEWS

మిస్టేక్ – ఒక తప్పు థ్రిల్లర్ చిత్రం విడుదలకు సిద్ధం

Satyam NEWS

Leave a Comment