38.2 C
Hyderabad
April 29, 2024 14: 30 PM
Slider ప్రత్యేకం

ఆద్యంతం వర్షం… తడుస్తూనే విజయనగరం ఉత్సవాలు నిర్వహణ…

#vijayanagaramfestival

విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి…ఆమె సమక్షంలో  మూడు రోజుల పాటు విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు నిర్వహణపై చాలా పకడ్బందీగా ప్రణాళికగా..సమిష్టి గా ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశించడంతో పాటు సూచించారు కూడా. అంతా సమిష్టి గా ఉంటూ అనుకున్న సమయానికి అంటే ఇచ్చిన సమయం ఉదయం 8 గంటలకు ప్రారంభసమయానికి వర్షం ప్రారంభమైంది.

అప్పటికే సగానికి పైగా ర్యాలీ ప్రారంభించబడే మూడులాంతర్ల వద్దకు సిధ్దంగా ఉండటం.. మరో వైపు… ముస్లిం దేవుడు మహ్మద్ ప్రవక్త కు సంబంధించిన పండగ సందర్భంగా ముస్లిం నేతలు… మూడు లాంతర్ల వద్ద నుంచీ ర్యాలీ ప్రారంభం కావడం… అదే సమయంలో వర్షం కురవడంతో… విజయనగరం ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ర్యాలీ కాస్త వెనకడుగు వేసింది. సమయం 09.30 అయినా ఉత్సవాలు సందర్భంగా నిర్వహించే ర్యాలీ ప్రారంభం కాకపోగా…ముస్లిం లు నిర్వహించే ర్యాలీ.. ప్రారంభమయి..తడుస్తూనే.. కోట ,బాలాజీ ,ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ మీదుగా… మళ్లీ నగరంలో కొత్త చేరుకుంది.

ఆ తర్వాత అయితే వర్షం తగ్గక పోవడం… ఇక రద్దు వాయిదా అలాంటి చర్యలు గురించి ఆలోచించకుండా… డేరింగ్ గి ధైర్యం తో జిల్లా కలెక్టర్ సాహసౌపేతంగా ముందడుగు వేసి…అటు డిప్యూటీ స్పీకర్ ను ఇటు మంత్రి బొత్స ను..మరోవైపు జేడ్పీ చైర్మన్ ను తీసుకువచ్చి…మూడులాంతర్ల నుంచీ వర్షం పడుతూ ఉండగానే ర్యాలీ ని ప్రారంభింప చేయడం లో కలెక్టర్ తీసుకున్న చర్యలు అమోఘం. కాస్త ఆలస్యమైనా…ముగ్గురు ప్రజాప్రతినిధులు సమక్షంలో గోడుగులేసుకుని మరీ..ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ర్యాలీ నిర్వహణ అనన్య సామాన్యం.ర్యాలీ నిర్వహణలో కాస్త మార్పు చోటు చేసుకోవడంతో ర్యాలీ లో పాల్గొన్న కళాకారులంతా వర్షానికి సైతం లెక్క చేయకుండా… ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలను తు.చ తప్పకుండా విజయనగర కళావైభవాన్ని.. చాటి చెప్పేందుకు అందుకు కలెక్టర్ చూపించి న తెగువ హేట్సాఫ్.

ఉత్సాహం ఉరకలేస్తూ వర్షం లో తడుస్తూనే కళా బృందాలు… తమ ,తమ ప్రదర్శన లు ఇస్తూ…విజయనగరం విశిష్టతను తమతమ కళారూపాల ద్వారా తెలియజేసారు. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ వెళ్లిపోయినా…జేడ్పీ చైర్మన్ ,కలెక్టర్ డీఆర్ఓ లు తడుస్తూనే… కళారూపాలకు స్వాగతం పలికడం…నిజంగా కలెక్టర్ చర్యలకు ఫలితమే.ఏదైనా విజయనగరం  ఉత్సవాలు… కలెక్టర్ సమక్షంలో ప్రారంభంలో కేవలం వర్షం మినహా… నగరంలోని వివిధ స్థలాల్లో సాక్షాత్తు మంత్రి బొత్స, డిప్యూటీ స్పీకర్ లతో పాటు ఎస్పీని తీసుకురా వడం…స్వయంగా విజయనగరం జానపద కళారూపాలైన పులి వేషాలు, కత్తిసాము…కర్రసాముల నిర్వహణ నిర్వహణ చేయడం.. తద్వారా విజయవంతం కావడానికి కారణం జిల్లా కలెక్టర్ అని చెబుతోంది సత్యం న్యూస్. నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

బెంగాల్ ప్రజలకు అక్క కాదు… మేనల్లుడికి అత్త మాత్రమే

Satyam NEWS

ఆక్సిజన్‌ను కొనుక్కునే ప‌రిస్థితి రానివ్వ‌ద్దు

Satyam NEWS

అమరావతిపై నిపుణుల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment