39.2 C
Hyderabad
May 4, 2024 22: 14 PM
Slider జాతీయం

సుప్రీమ్ కోర్ట్:పౌరసత్వసవరణచట్టంపై కేరళప్రభుత్వం సవాల్

kerala on caa

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ చట్టం రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కులను కాలరాసేదిగా ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది.సీఏఏ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21,25లను ఉల్లంఘిస్తోందని,ఇది సెక్యులరిజానికి వ్యతిరేమని ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరింది.

సీఏఏ చట్టంతో పాటు పాస్‌పోర్ట్ యాక్ట్,ఫారినర్స్ యాక్ట్ నిబంధనలను కూడా కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసినమొదటి రాష్ట్రంఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసిన ఏకైక రాష్ట్రం కూడా కేరళనే కావడం గమనార్హం.

సీఏఏ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21,25లను ఉల్లంఘిస్తోందని,ఇది సెక్యులరిజానికి వ్యతిరేమని ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరింది. సీఏఏ చట్టంతో పాటు పాస్‌పోర్ట్ యాక్ట్,ఫారినర్స్ యాక్ట్ నిబంధనలను కూడా కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.ఈ నెలలోనే కేరళ ప్రభుత్వం సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేసింది.

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 11మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులకుసెక్యులరిజాన్ని దెబ్బతీసే ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ లేఖలు రాశారు. సీఏఏ చట్టాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు వతీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ చట్టానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో ఇప్పటికీ ఆమె ర్యాలీలు చేపడుతూనే ఉన్నారు.

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చట్టాలను వ్యతిరేకించారు. అయితే కేరళ ప్రభుత్వం మాత్రమే సీఏఏని చట్టపరంగా సవాల్ చేస్తోంది.

Related posts

గెలిపించిన ప్రజలకు చేసే న్యాయం ఇదేనా?

Satyam NEWS

ఎల్లూరు గ్రామ రైతులకు కాంగ్రెస్ నేత సంఘీభావం

Satyam NEWS

అర్ధరాత్రి విజయనగరం లో ఆపరేషన్ నైట్ స్టార్మింగ్…!

Satyam NEWS

Leave a Comment