37.2 C
Hyderabad
May 6, 2024 14: 07 PM
Slider శ్రీకాకుళం

ట్రిబ్యూట్: కోడి రామ్మూర్తికి ఘన నివాళి

kodi rama 14

కలియుగ భీముడు, అభినవ ఇండియన్ హెర్క్యులస్, మల్ల మార్తాండ, జై వీర హనుమాన్ బిరుదులు కలిగిన ఏకైక భారతదేశ యోధుడు కోడి రామ్మూర్తి వర్ధంతి నేడు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి శ్రీకృష్ణ చంద్ర గజపతి మహారాజు కళాశాలలో ఆయనకు విద్యార్థులు, శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి  తెలగ యువజన సంఘం, శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష సంఘ ప్రధాన కార్యదర్శి గుండబాల మోహన్ నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా గుండబాల మోహన్న మాట్లాడుతూ కోడి రామ్మూర్తి  శ్రీకాకుళం జిల్లాల కి చెందడం వల్లనే జిల్లాకి దేశంలో, ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని అన్నారు. దేశ , విదేశాలలో అనేక బలప్రదర్శన ఇచ్చి ప్రజల అభిమానం పొందిన మహనీయుడు కోడి రామ్మూర్తి అని ఆయన అన్నారు.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో పుట్టి మద్రాసులోని సయ్యద్ వ్యాయామ శిక్షణ కళాశాలలో శిక్షణ పొంది తిరిగి విజయనగరం మహారాజు ఆ స్థానంలో వ్యాయామ ఉపాధ్యాయుని గా ఆయన పని చేశారని బాల మోహన్ తెలిపారు. ఎంతో మందికి ఆయన యోగ, మల్ల యుద్ధం, దేహదారుఢ్యం, జమ్నా స్టిక్స్ క్రీడల్లో క మెళుకువలను ఆయన విద్యార్థులకు నేర్పారని అన్నారు.

విచారకరమైన అంశం ఏమిటంటే శ్రీకాకుళం పట్టణంలో ఆయన పేరు మీదుగా స్టేడియం నిర్మాణం తలపెట్టారు కానీ ఇప్పటి వరకు నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా శ్రీకాకుళం జిల్లా సంబంధించిన అధికారులు, రాజకీయ నాయకులు మేల్కొని ఆయనకు సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరుతున్నామని అన్నారు.

Related posts

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న రామగుండం పోలీస్ కమిషనర్

Satyam NEWS

నిత్యావసరాలు పంచుతున్న కూకట్ పల్లి ఆర్టీసీ TMU కార్మికులు

Satyam NEWS

రాజంపేటలో జగనన్నే మా భవిష్యత్తు,మా నమ్మ కం…

Bhavani

Leave a Comment