33.2 C
Hyderabad
May 4, 2024 01: 37 AM
Slider ఖమ్మం

ఖమ్మం మెడికల్‌ కాలేజీకి అనుమతి

#puvvada

మంత్రి పువ్వాడ అజయ్ పట్టుదలతో  నెరవేరుతున్న దశాబ్దాల కల

ఖమ్మం జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అశయం, ప్రజల కోసం ఆయన చేసే ఆలోచనలో మరో ముందడుగు పడింది. నగరంలో స్థాపించే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.

ప్రతిపాదించిన మేరకు రూ.166 కోట్ల రూపాయల నిధులను మంత్రి పువ్వాడ చొరవతో కళాశాలకు 100 ఎంబీబీఎస్‌ సీట్లకు పరిపాలనా అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఖమ్మం కిరీటంలో మరో మరో కలికితురాయి చేరింది. జిల్లా విద్యా హబ్‌గా మారుతున్న నేపథ్యంలో విశేషంగా కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి జిల్లా ప్రజలు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు నగరంలోని పాత కలెక్టరేట్ స్థలంతో పాటు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గల మొత్తం 30 ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కాలేజీ ఏర్పాటుకు బదలాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం ప్రగతి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో నిరంతరం కొనసాగుతూనే ఉంది.

అభివృధ్ది, ప్రగతి పథంలో నడిపించే గట్స్‌ మంత్రి అజయ్ లో మొండుగా ఉన్నాయి. పాజిటివ్‌ స్పిరిట్‌, దూకుడు ప్రదర్శిస్తూ ముందుకుసాగిపోతున్నారు. అదే దూకుడు మెడికల్ కాలేజీ మంజూరు, అనుమతుల సాధనలో సైతం కనిపించింది. రాష్ట్ర దార్శనిక ముఖ్యమంత్రి కేసిఆర్ మార్గదర్శకత్వంలో మంత్రి అజయ్ చేస్తున్న కృషి ఫలితంగా ఖమ్మం ప్రజల దశాబ్దాల కల నెరవేరతుంది.

Related posts

లాభాలు తగ్గి ఉద్యోగుల్ని తీసేస్తున్న స్విగ్గీ

Satyam NEWS

జనవరి 31 నుంచి అగ్రి టెక్నాల‌జీ & ఇన్నోవేష‌న్‌ ఎగ్జిబిష‌న్

Satyam NEWS

వనపర్తిలో రోడ్డుపై ధర్నా చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

Satyam NEWS

Leave a Comment