26.7 C
Hyderabad
May 1, 2025 05: 10 AM
Slider ఆదిలాబాద్

ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఊహించని అనుభవం

khanapur mla

ఖానాపూర్ ఎమ్మెల్యే స్త్రీ ,శిశు సంక్షేమ చైర్మన్  రేఖా నాయక్ ను టేక్ లక్ష్మి కుటుంబీకులు అడ్డుకున్నారు. అంతే కాకుండా  పోచంపల్లి గ్రామస్తులు ఆమెను నిలదీశారు.

గత నెల 24న ఆసిఫాబాద్ జిల్లా లో అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య కు గురైన లక్ష్మి కుటుంబాన్ని స్త్రీ శిశు సంక్షేమ చైర్పర్సన్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఈరోజు పరామర్శించడానికి రావడంతో ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగి ఎన్ని రోజులైనా ఇప్పుడు వస్తావా అని గ్రామస్తులు నిలదీయడంతో ఎమ్మెల్యే వారిని సముదాయించి లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఊరురా తిరుగుతూ చిన్న చితక వ్యాపారం చేసుకునే మా ఆడవాళ్ళు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ఈ భయం పోవాలంటే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదంటే దిశ పై జరిగిన హత్య ఘటన లో జరిగిన న్యాయమే టేక్ లక్ష్మి ఘటన కు బాధ్యులైన వారిని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేయాలని అప్పుడే టేక్ లక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే టేకు లక్ష్మి భర్త పిల్లలు, కుటుంబ సభ్యులు వేడుకున్నారు.

Related posts

ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం

Satyam NEWS

అందుబాటులోకి రానున్న కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు

Murali Krishna

ఉత్తరాదిన క్రేజ్ పుట్టినస్తున్న సమంత చిత్రం యశోద

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!