38.2 C
Hyderabad
May 5, 2024 19: 38 PM
Slider మహబూబ్ నగర్

సహాయ కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

kollapur SI

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు సహాయం చేసే ఉద్దేశ్యంతో కొందరు చేస్తున్న స్వచ్ఛంద సేవ లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నదని కొల్లాపూర్ పోలీసులు తెలిపారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు,  స్వచ్ఛంద సంస్థలు, యూత్ లీడర్స్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని పోలీసులు హెచ్చరించారు.

నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు ఇతర వస్తువులు పంపిణీ చేసే సమయంలో భౌతిక దూరాన్ని ఎవరూ పాటించడం లేదని ఇది చట్ట విరుద్ధమని ఎసై కొంపల్లి మురళి గౌడ్ హెచ్చరించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు అనధికారికంగా చేయడమే కాకుండా ఆ ప్రోగ్రాంలో సామాజిక దూరం  పాటించడ కుండా,  మాస్కులు ధరించకుండా  కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారు. 

ఇవన్నీ కూడా COVID-19 నిబంధనలు ఉల్లంఘించడం కిందికే వస్తాయి.  కాబట్టి ఏ ఒక్క నాయకుడు, ఇతరులు కూడా అధికారికంగా ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏ ప్రోగ్రాంను లేదా ఇతర చిన్న చిన్న కార్యక్రమాలను నిర్వహించ కూడదు. అలా నిర్వహించినట్లయితే అది ఎవరైనా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వెంబడి ఉన్న అందరి పైన కూడా కేసులు నమోదు చేస్తామని కొల్లాపూర్ పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా కొల్లాపూర్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకు కారకులైన ఏ ఒక్కరిని కూడా వదిలి పెట్టడం జరగదు. ఇది పోలీసువారి హెచ్చరిక అని ఆయన అన్నారు.

Related posts

మెగా ఫ్యాన్స్ కి ఇక పూనకాలే

Satyam NEWS

ఐజీగా పదోన్నతి పోందిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా ఉక్కు మనిషి పటేల్ జయంతి

Satyam NEWS

Leave a Comment